త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | గ్రామీణ తెలంగాణ అభివృద్ధే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్యం : మంత్రి సీత‌క్క‌

Minister Seethakka | గ్రామీణ తెలంగాణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమ‌ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్ప‌ష్టం చేశారు. జ్యోతిరావుపూలే ప్ర‌జా భ‌వ‌న్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్‌డీఓలు, డీపీఓలతో మంత్రి సీతక్క రాష్ట్ర‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.

S

Telangana | Published On Jun 23, 2026, 4.06 pm IST

Minister Seethakka | గ్రామీణ తెలంగాణ అభివృద్ధే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్యం : మంత్రి సీత‌క్క‌
Advertisement

Minister Seethakka | త్రినేత్ర‌.న్యూస్ : గ్రామీణ తెలంగాణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమ‌ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్ప‌ష్టం చేశారు. జ్యోతిరావుపూలే ప్ర‌జా భ‌వ‌న్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్‌డీఓలు, డీపీఓలతో మంత్రి సీతక్క రాష్ట్ర‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ దాన కిషోర్, క‌మిష‌న‌ర్ దివ్యా దేవ‌రాజ‌న్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ స్థాయిలో భూగర్భ జలాలు పెంచే విధంగా 'జలసిరి' పోస్టర్లు మంత్రి సీతక్క ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు కలిపి ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ శాఖకు ఆ శాఖ విడివిడిగా పనిచేస్తే ఆశించిన ఫలితాలు రావు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. అన్ని శాఖలు సమన్వయంగా ప్రణాళిక బద్ధంగా పనిచేయాలి. ఐదు సంవత్సరాల కాలంలో గ్రామాలకు వేలకోట్ల నిధులు సమకూరుతాయి. అయినప్పటికీ అనుకొన్న స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చెందడం లేదు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో ప్రతి జిల్లాకు ఐదుగురు అధికారులు హెచ్‌వోడీలుగా పనిచేస్తారు. వీరంతా కలిసి పని చేస్తే గంగదేవపల్లి వంటి ఆదర్శ గ్రామాలను సునాయాసంగా తీర్చిదిదగలం. ఆ దిశలో అధికారులు జిల్లాల వనరులు పరిస్థితులను బట్టి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

తెలంగాణ గ్రామాల్లో అపారమైన వనరులు ఉన్నాయి.. టీమ్‌గా ప్రణాళిక బద్ధంగా పనిచేస్తే అభివృద్ధి చెందిన గ్రామాలు ఆవిష్కృతమవుతాయి. ఒక్కో నీటి బొట్టు ను ఒడిసిపట్టి మన అవసరాలు ఎలా తీర్చుకుంటామో... అలాగే గ్రామాలకు వచ్చే నిధులను ఆ రకంగా వాడుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తెలంగాణ గ్రామీణ ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలి. గ్రామాల్లో సమస్యలు తలెత్తని విధంగా గ్రామాలను తీర్చిదిద్దాలి. గ్రామం యూనిట్‌గా ప్రణాళికలు సిద్ధం చేయాలి. గ్రామ ప్రణాళికలు రూపొందించి శాఖలు సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయాలి. వచ్చే రెండు నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలి. ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశం ఏర్పాటు చేస్తాన‌ని సీత‌క్క తెలిపారు.

మన అందరిదీ గ్రామీణ నేపథ్యమే.. కాబట్టి బాధ్యతగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్లు జిపి నిధులను సరైన మార్గంలో వెచ్చించేలా గైడ్ చేయాలి. కొన్నిచోట్ల నిధులు పక్కదారి పట్టినట్లుగా వార్తలు వచ్చాయి. గ్రామ సభ నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా నిధులు వెచ్చిస్తే చర్యలు తప్పవు. ఆదర్శ గ్రామాలు అభివృద్ధి చెందిన గ్రామాలను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కరెంటు, రోడ్డు సదుపాయం లేని గ్రామం నుంచి వచ్చాను. గ్రామీణ ప్రాంత ప్రజల కష్టాలు నాకు తెలుసు. అలాంటి కష్టాలు ప్రజలకు లేకుండా మన వంతు బాధ్యత నెరవేర్చుదాం. 1.35 లక్షల మంది సిబ్బంది మన శాఖ పరిధిలో ఉన్నారు. 34 వేల కోట్ల వార్షిక బడ్జెట్ ఉంది. ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకొని ప్రణాళికబద్ధంగా ఖర్చు చేస్తే అభివృద్ధి చెందిన తెలంగాణ ఆవిష్కృతమవుతోంది అని మంత్రి సీత‌క్క అన్నారు.

Advertisement
Advertisement