త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | అవినీతి సీత‌క్క అంటే ‘చెప్పు’ తెగుత‌ది.. బీఆర్ఎస్ నేత‌ల‌కు మాస్ వార్నింగ్

Minister Seethakka | అవినీతి సీత‌క్క అంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్న బీఆర్ఎస్ నేత‌ల‌కు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క మాస్ వార్నింగ్ ఇచ్చారు. నాపై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తే చెప్పు తెగుత‌ది అని ఆమె సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చారు.

S

Telangana | Published On Apr 11, 2026, 4.04 pm IST

Minister Seethakka | అవినీతి సీత‌క్క అంటే ‘చెప్పు’ తెగుత‌ది.. బీఆర్ఎస్ నేత‌ల‌కు మాస్ వార్నింగ్
Advertisement

Minister Seethakka | త్రినేత్ర‌. న్యూస్ : అవినీతి సీత‌క్క అంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్న బీఆర్ఎస్ నేత‌ల‌కు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క మాస్ వార్నింగ్ ఇచ్చారు. నాపై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తే చెప్పు తెగుత‌ది అని ఆమె సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన వారిపై కేసులు పెట్టాల‌న్నారు. మేడారం అభివృద్ధి ప‌నుల్లోనూ తాను కాంట్రాక్ట‌ర్ల వ‌ద్ద ఎలాంటి క‌మీష‌న్లు తీసుకోలేద‌ని సీత‌క్క పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన ములుగు జిల్లా కార్యవర్గ సమావేశంలో సీత‌క్క మాట్లాడారు.

అణగారిన వర్గాలు, సామాన్యులు సంతోషంగా ఉంటే బిఆర్ఎస్ నాయకులు తట్టుకోలేరు. మొబైల్ ఫోన్లు అంగన్వాడి టీచర్లకు పంచుతుంటే స్కాం జరిగిందంటూ దీర్ఘాలు తీస్తున్నారు. రూ. 11650 మొబైల్ కొనుగోలు చేస్తే రూ. 14500 కి కొనుగోలు చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తక్కువ ధరకు మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేస్తే... ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని.. అందులో కోట్ల కుంభకోణం జరిగిందని ఊహాజనిత కథనాలు అల్లుతున్నారు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి సీతక్క అని తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది జాగ్రత్త అని సీత‌క్క హెచ్చ‌రించారు.

ఓపెన్ టెండర్ విధానంలో కొనుగోలు చేశాం

కేంద్రం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారమే, కేంద్రం నిర్దేశించిన ధరలకు లోబడే థర్డ్ పార్టీ ద్వారా మొబైల్స్ ఓపెన్ టెండర్ విధానంలో కొనుగోలు చేశాం. సాంకేతిక సామర్థ్యం ఉన్న ఐటీ శాఖ పరిధిలోని టీజీటీఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్ GeM ద్వారా కొనుగోలు చేశాం. బీజేపీ పాలిత రాష్ట్రాలు మనం కొనుగోలు చేసిన మోడల్ మొబైల్స్‌ను ఇంకా ఎక్కువ కొనుగోలు చేశారని ఆమె తెలిపారు.

తప్పుడు ఆరోపణలు చేస్తే లీగల్ చర్యలు తప్పవు 

ఏ మంచి పని చేసినా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రం పచ్చబడుతుంటే బీఆర్ఎస్ నాయకుల కండ్లు ఎర్రబడుతున్నాయి. బీఆర్ఎస్ బురద రాజకీయాలు చేస్తోంది. నిరాధార ఆరోపణలు చేస్తూ బురద చల్లుతుంది. తప్పుడు ఆరోపణలు చేస్తే లీగల్ చర్యలు తప్పవు. ఏ పని చేసిన అవినీతి ముద్ర వేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్తు ఇచ్చిన సహించలేకపోతున్నారు. 200 కోట్లతో మేడారాన్ని అభివృద్ధి చేస్తే అవినీతి జరిగిందంటూ కారు కూతలు కుస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఓపిక పట్టింది చాలు.. మన మీద తప్పుడు ఆరోపణలు చేస్తే దీటుగా తిప్పి కొట్టండి అని మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement