Minister Seethakka | ఎవరూ దొంగిలించలేనిది విద్య.. నేనే ప్రత్యక్ష ఉదాహరణ
Minister Seethakka | ఎవరూ దొంగిలించలేని విద్య అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజా సేవలో బిజీగా ఉన్నప్పటికీ తాను చదువును ఎక్కడా ఆపలేదు అని ఆమె స్పష్టం చేశారు. మాదాపూర్ శిల్పకళా వేదికలో శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు.
Minister Seethakka | త్రినేత్ర.న్యూస్ : ఎవరూ దొంగిలించలేని విద్య అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజా సేవలో బిజీగా ఉన్నప్పటికీ తాను చదువును ఎక్కడా ఆపలేదు అని ఆమె స్పష్టం చేశారు. మాదాపూర్ శిల్పకళా వేదికలో శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవం ఉన్న వెంకయ్య నాయుడు అంటే అందరికీ గౌరవం. ఆయన సలహాలు సూచనలు మన దేశానికి ఎంతో అవసరం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెంకయ్య నాయుడు ఉన్నత స్థాయికి చేరుకున్నారు అని సీతక్క తెలిపారు.
విద్యార్థులందరూ వెంకయ్య నాయుడిని ఆదర్శంగా తీసుకోవాలి. మీ లక్ష్యాలను సాధించుకునే విధంగా కృషి చేయాలి. విద్యార్థి దశలో కష్టపడితే జీవితాంతం గౌరవంగా బతకొచ్చు. ఇష్టంగా విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. చదువు అనేది మనిషి ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. పదో తరగతితో చదువును ఆపేసిన నేను ఆ తర్వాత చదువు కొనసాగించాను. ప్రజాసేవలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ చదువును ఎక్కడ ఆపలేదు. ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం, పీహెచ్‌డీ పూర్తి చేశాను. ఆస్తుపాస్తులు ముఖ్యం కాదు విద్యా శాశ్వతం. ఎవరూ దొంగిలించలేనిది విద్య అని మంత్రి సీతక్క అన్నారు.
మారుమూల జిల్లా ములుగు పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో కెల్లా తొలి స్థానంలో నిలిచింది. టీచర్లు క్రమశిక్షణతో పాఠాలు బోధించారు. అప్పటి జిల్లా కలెక్టర్ దివాకర్, జిల్లా యంత్రాంగం చక్కగా సమన్వయం చేశారు. ములుగు జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు.. శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



