త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhaker | రాష్ట్రంలో అగ్నిప్ర‌మాదాల‌కు 163 మంది బ‌లి : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

Ponnam Prabhaker | రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 8861 అగ్నిప్ర‌మాదాలు జ‌రిగాయ‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. ఈ అగ్నిప్ర‌మాదాల కార‌ణంగా రూ. 879 కోట్ల ఆస్తి న‌ష్టం జ‌ర‌గ్గా, 163 మంది చ‌నిపోయార‌ని పేర్కొన్నారు.

S

Telangana | Published On Jan 6, 2026, 1.35 pm IST

Ponnam Prabhaker | రాష్ట్రంలో అగ్నిప్ర‌మాదాల‌కు 163 మంది బ‌లి : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్
Advertisement

Ponnam Prabhaker | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 8861 అగ్నిప్ర‌మాదాలు జ‌రిగాయ‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. ఈ అగ్నిప్ర‌మాదాల కార‌ణంగా రూ. 879 కోట్ల ఆస్తి న‌ష్టం జ‌ర‌గ్గా, 163 మంది చ‌నిపోయార‌ని పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా అగ్నిమాప‌క శాఖ‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి పొన్నం స‌మాధానం ఇచ్చారు.

సంగారెడ్డి దగ్గర సిగాచి అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే ఇంట్లో 17 మంది చనిపోయారని తెలిపారు. రాష్ట్రంలో 138 ఫైర్ స్టేషన్లు, 9 ఔట్ పోస్టులు ఉన్నాయి. 544 ఫైర్ సేఫ్టీ వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కొత్త‌గా 58 అగ్నిమాప‌క కేంద్రాలు

రాష్ట్రంలో కొత్త‌గా 58 అగ్నిమాప‌క కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. చర్ల, దేవరకద్ర, కల్లూరు, గుండాల, బోథ్, కొంకచర్ల, రుద్రంగి, జయనాథ్ మండలం హెచ్ క్యు, బయ్యారం, తూప్రాన్, పాశమైలరం, జిన్నారం, బీబీ నగర్, ఉప్పల్ బగాయత్, బాచుపల్లి, ఘట్‌కేస‌ర్‌లు తదితర ప్రాంతాలకు వచ్చాయి. గౌలిగూడ,సికింద్రాబాద్, ఓల్డ్ మారేడ్‌ప‌ల్లి, ఖైరతాబాద్, మియాపూర్ తదితర ప్రాంతాలకు స్థాయి పెంపు చేయడం జరిగింది.

పెరుగుతున్న 18 అంతస్తులు, 104 అంతస్తుల బిల్డింగ్‌కి సంబంధించి మిషనరీ ప్రాసెస్‌లో ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ, ఆసుపత్రులు పరిశ్రమలు, విద్యాలయాలు ఫైర్ సేఫ్టీపై 13658 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడడం వస్తే ప్రమాదం నుండి ఎలా కాపాడుకోవాలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది నియామకాలు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ లూస్ కేబుల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి దాని ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఫైర్ సేఫ్టీ అప్రమత్తంగా ఉండాలి అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement