Ponnam Prabhakar | పోలీసు శాఖలో ప్రమోషన్ల జాప్యం నిజమే : మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | గతంలో రిక్రూట్‌మెంట్ నంబర్ ఎక్కువగా జరగడంతో ఖాళీలు లేకపోవడం వల్ల ప్రమోషన్లలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : గతంలో రిక్రూట్‌మెంట్ నంబర్ ఎక్కువగా జరగడంతో ఖాళీలు లేకపోవడం వల్ల ప్రమోషన్లలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పోలీసు శాఖపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం సమాధానం చెప్పారు.
తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఇందుకు పోలీసు డిపార్ట్‌మెంట్ క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తోంది. రాష్ట్రంలో ప్రశాంతతకు పాటుపడుతున్న పోలీసులను అభినందిస్తున్నాను. కొందరు సభ్యులు పదోన్నతుల గురించి మాట్లాడారు. ఖాళీలు వచ్చిన చోట దాని ప్రకారం ప్రమోషన్లు ఇస్తాం. కానిస్టేబుళ్లకు ఖాళీ ఏర్పడినప్పుడే ప్రమోషన్లు వస్తాయి. నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయి. హోంగార్డులను అక్కున చేర్చుకుంటున్నాం. వారికి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇక రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి పాజిటివ్‌గా ముందుకు పోతున్నాం. దీనిపట్ల వ్యతిరేకత అవసరం లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఒక్కసారి మాత్రమే పోలీసు శాఖలో నియామకాలు జరిపారు. మేం వచ్చాక ఒకసారి నియామకాలు జరిపించామని మంత్రి తెలిపారు.
షిఫ్ట్ సిస్టమ్‌కు సంబంధించి రివ్యూ చేస్తాం. టీఏ డీఏలకు ఇబ్బందులు ఉన్నాయి. అందుకే జాప్యం జరుగుతుంది. కానిస్టేబుళ్ల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ పోలీసుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాం. నిరంతరం ప్రజా సేవలో ఉంటున్న వారిపట్ల సానుకూలంగా ఉన్నాం. ఆంధ్రా పోలీసులు ఇక్కడ ఉన్నారని చెబుతున్నారు. దీనిపై అధికారుల కమిటీ పని చేస్తుంది. బదిలీలపై ఆలోచన చేస్తున్నాం. హోంగార్డులు కానిస్టేబుళ్లు చనిపోయినా వారి కుటుంబాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆదుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
మే 21, 2026

Ponnam Prabhakar | ‘సర్’ పై అప్రమత్తంగా ఉందాం: నియోజకవర్గ ఇంచార్జీలు, పరిశీలకులతో పొన్నం
మే 16, 2026

TG Govt | తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ.. చైర్మన్‌గా కే కేశవరావు
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



