త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ప్ర‌తి గ్రాడ్యుయేట్ ఓటును న‌మోదు చేయిద్దాం

KTR | అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు విస్తృతంగా కృషి చేయాలని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సూచించారు.

S

Telangana | Published On Sep 26, 2026, 6.55 pm IST

KTR | ప్ర‌తి గ్రాడ్యుయేట్ ఓటును న‌మోదు చేయిద్దాం
Advertisement
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లపై ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్దాం
  • ఈసారి ఎలాగైనా గెలిచేలా ప‌ని చేద్దాం
  • వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నేతలతో భేటీలో కేటీఆర్ దిశానిర్దేశం

KTR | త్రినేత్ర న్యూస్: అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు విస్తృతంగా కృషి చేయాలని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే సమయానికి పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నేతలతో శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ విడివిడిగా భేటీ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎన్నికలకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌ అత్యంత కీలకమైన అంశం. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లను మోసం చేసిందన్న ఆగ్రహం వారిలో తీవ్రంగా ఉంది. చదువుకున్నవారు తమ సమస్యలతోపాటు తమ కుటుంబాలు, అన్నదాతలు, మహిళలు, యువత సహా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను గమనిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాలకు ద్రోహం చేసిందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు. ఆ వ్యతిరేకత బీఆర్‌ఎస్‌కు అనుకూల‌ ఓటుగా మారేలా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పరిధిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయం మ‌న‌కు తెలుసు. ఈసారి పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అభ్యర్థి ఎవరైనా ఎన్నిక పార్టీ గుర్తుపైనే జరుగుతుంది. నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి అని కేటీఆర్ సూచించారు.

Advertisement
Advertisement