త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌ వ‌ల్లే భౌతిక దాడులు : మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar | ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు స్థానం లేదు అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో సర్వ సాధారణం.. నాయకులు హుందాతనంతో వ్యవహరించాలి అని సూచించారు.

S

Telangana | Published On May 7, 2026, 7.17 pm IST

Ponnam Prabhakar | వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌ వ‌ల్లే భౌతిక దాడులు : మంత్రి పొన్నం ప్రభాకర్
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు స్థానం లేదు అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో సర్వ సాధారణం.. నాయకులు హుందాతనంతో వ్యవహరించాలి అని సూచించారు.

వ్యక్తిగత విమర్శలకు తావు లేదు. కొంత మంది నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. నాయకులంతా ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి. ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలి. ప్రజా ప్రతినిధుల ఇళ్ల పై మరో ప్రజా ప్రతినిధుల కార్యకర్తలు దాడులకు దిగడం సరికాదు. చౌకబారు ప్రచారం కోసం దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదు. ఎవరి మనసైన నొచ్చుకుంటే దీటుగా సమాధానం చెప్పాలి కానీ దాడులకు దిగడం సరికాదు. నాయకులు ఎవరైనా తమ కార్యకర్తలను అదుపు చేసుకోవాలి. భౌతిక దాడులకు దిగుతున్న కార్యకర్తలపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అని పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు.

Advertisement
Advertisement