త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemulawada | ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Vemulawada | సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. శ్రీరామ నవమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న శివార్చన స్టేజీ వద్ద సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమర్పించారు. ఈ

P

Telangana | Published On Mar 27, 2026, 4.00 pm IST

Vemulawada | ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Vemulawada | సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. శ్రీరామ నవమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న శివార్చన స్టేజీ వద్ద సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమర్పించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించామని తెలిపారు. సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలన్నారు.

ప్ర‌భుత్వ విప్ మాట్లాడుతూ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. వేములవాడలో శ్రీ సీతారాముల కల్యాణం నిర్వ‌హించ‌డం సంప్రదాయంగా వస్తుందని వివరించారు. కల్యాణానికి 50వేల భక్తులు వస్తారనే అంచనా మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పందిళ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. నూతన వేదిక వద్ద శివ, సీతారాముల కల్యాణం వేడుకలు దేవాదాయ శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని వివరించారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement