త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ప‌వ‌న్‌ను తెలంగాణ స‌మాజం.. ఉద్య‌మ వ్య‌తిరేకిగానే చూస్తుంది!

Ponnam Prabhakar | కొండ‌గ‌ట్టుకు వచ్చి పూజ‌లు చేసినా.. అభివృద్ధి మాట‌లు చెప్పినా తెలంగాణ స‌మాజం జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాన్‌ని ఎప్ప‌టికీ ఉద్య‌మ వ్య‌తిరేకిగానే చూస్తుంద‌ని ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారు.

P

Telangana | Published On Feb 6, 2026, 4.05 pm IST

Ponnam Prabhakar | ప‌వ‌న్‌ను తెలంగాణ స‌మాజం.. ఉద్య‌మ వ్య‌తిరేకిగానే చూస్తుంది!
Advertisement
  • తెలంగాణ ద్రోహుల‌కు బీజేపీ కొమ్ముకాస్తోంది
  • ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసేలా వ్య‌ఖ్య‌లు చేసిన వారిని ప్ర‌జ‌లు ఆమోదించ‌రు
  • ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బీజేపీ పార్టీల‌పై పొన్నం ప్ర‌భాక‌ర్ ఫైర్‌

Ponnam Prabhakar | కొండ‌గ‌ట్టుకు వచ్చి పూజ‌లు చేసినా.. అభివృద్ధి మాట‌లు చెప్పినా తెలంగాణ స‌మాజం జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాన్‌ని ఎప్ప‌టికీ ఉద్య‌మ వ్య‌తిరేకిగానే చూస్తుంద‌ని ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవ‌డంపై ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని కించపరిచే శక్తులతో బీజేపీ పొత్తు పెట్టుకోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఏర్పాటును వేర్పాటువాదంగా అభివ‌ర్ణించిన‌, కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి త‌గిలింద‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవ‌డంపై బీజేపీ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా బడ్జెట్‌లో తెలంగాణ‌ఖు రూపాయి కూడా ఇవ్వ‌ని కేంద్ర ప్రభుత్వం, ప్ర‌స్తుతం తెలంగాణ ద్రోహులకు కొమ్ముకాస్తోందని విమ‌ర్శించారు.

ఈ కుట్ర‌ను మేధావులు, ఉద్య‌మ‌కారులు గుర్తించాల‌న్నారు. ఫెడరల్ వ్యవస్థలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ల‌వ‌చ్చ‌న్న మంత్రి.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన వారిని రాష్ట్ర ప్ర‌జ‌ల ఆమోదించ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ పాల‌క‌వ‌ర్గంలో ఉండాల‌న్నారు. హుస్నాబాద్‌లోని 20 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు. పట్టణం పెరిగితేనే ఉపాధికి అవ‌కాశాలుంటాయ‌ని.. హుస్నాబాద్‌ను పెద్ద న‌గ‌రంగా తీర్చిదిద్దే కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు సాగుతున్నామ‌న్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ప్రత్యేక అభివృద్ధి చేస్తామ‌న్నారు. కాంగ్రెస్ ప‌థ‌కాల‌ను చూసి ఎన్నిక‌ల్లో ఓట్లు వేసి గెలిపించాల‌ని ఆయ‌న కోరారు.

Advertisement
Advertisement