త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఎన్ని వైరుధ్యాలున్నా.. శంక‌రుని ప‌రివారంలా క‌లిసి ఉండాలి: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

Ponnam Prabhakar | వారంతా ఒకే కుటుంబంలో స‌భ్యులు. ఒక‌రంటే ఒక‌రు ప‌డ‌క‌పోవ‌డం వారి స‌హ‌జ‌గుణం. అయినా వారిమ‌ధ్య‌ ఎన్ని వైరుధ్యాలున్న‌ప్ప‌టికీ కుటుంబం అనే భావ‌న వ‌చ్చేట‌ప్ప‌టికీ అంతా క‌లిసే ఉంటారు.

G

Telangana | Published On Mar 28, 2026, 2.36 pm IST

Ponnam Prabhakar | ఎన్ని వైరుధ్యాలున్నా.. శంక‌రుని ప‌రివారంలా క‌లిసి ఉండాలి: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: వారంతా ఒకే కుటుంబంలో స‌భ్యులు. ఒక‌రంటే ఒక‌రు ప‌డ‌క‌పోవ‌డం వారి స‌హ‌జ‌గుణం. అయినా వారిమ‌ధ్య‌ ఎన్ని వైరుధ్యాలున్న‌ప్ప‌టికీ కుటుంబం అనే భావ‌న వ‌చ్చేట‌ప్ప‌టికీ అంతా క‌లిసే ఉంటారు. దీనికి మంచి ఉదాహ‌ర‌ణే శంక‌రుని ప‌రివారం. కుటుంబంలా అంతా క‌లిసి ఉంటేనే స‌మాజంలో ఎదుగుతామ‌ని శంక‌రుని కుటుంబ ప‌రివారానికి సంబంధించిన ఫొటోను అసెంబ్లీలో చూపిస్తూ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) వివ‌రించారు. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా బ‌ల‌హీన వ‌ర్గాల‌కు సంబంధించి స‌భ్యులు లేవ‌నెత్తిన అంశాల‌కు మంత్రి స‌మాధాన‌మిస్తూ.. ఇది శంకరుని కుటుంబ ప‌రివారానికి సంబంధించిన ఫొటో. ఇందులో శంక‌రుని వాహ‌నం నంది. పార్వ‌తి వాహ‌నం సింహం. కుమార స్వామి వాహ‌నం నెమ‌లి. విఘ్నేష్వ‌రుని వాహ‌నం ఎలుక‌. ఇందులో ఒక‌దానికి ఒక‌టి ప‌డ‌దు. నెమ‌లికి ఎలుక‌కు ప‌డదు. ఎద్దుకు, సింహానికి ప‌డ‌దు. కానీ వారంతా ఒక ప‌రివారంగా క‌లిసి ఉంటారు. శివుని కుటుంబం లాగా బ‌లహీన వర్గాలకు సంబంధించిన విషయంలో కూడా మనం కలిసి ఉండాలని చెప్పారు.

బీసీల‌కు సంబంధించిన సంక్షేమం నేడు చాలా అవ‌స‌రం ఉన్న‌ది. నాయ‌కులు ఏ పార్టీకి చెందిన‌వారైన‌ప్ప‌టికీ బీసీలకు సంబంధించిన విష‌యంలో అంతా ఒక్క‌టిగానే ఉండాల‌ని చెప్పారు. మ‌హాత్మా జ్యోతిబా పూలే చెప్పిన‌ట్లుగా ఏ స‌మాజ‌మైనా అభివృద్ధి సాధించాలంటే విద్యే ప్ర‌ధాన ఆయుధం. విద్య ద్వారానే వెనుక‌బ‌డిన వ‌ర్గాల స‌మ‌గ్ర అభివృద్ధి సాధ్య‌మ‌వుతుందనే విశ్వాసంతో ఈ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. గురుకులాల్లో మౌలిక వసతులు పెంచుతున్నామని తెలిపారు. ఆయా పాఠశాలల్లో చదువుకుని అనేకమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లారన్నారు. విద్యార్థుల కోసం వంద సమీకృత హాస్టళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. రాాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. బీసీల అభివృద్ధి గురించి బీఆర్ఎశ్ ప్రభుత్వం చేసేందేమి లేదని ఎద్దేవా చేశారు. బీసీల అభివృద్ధి గురించి విపక్ష నేతలు మంచి సలహాలు ఇవ్వాలని సూచించారు. బ‌లహీనవర్గాలకు త‌మ‌ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న‌ద‌ని చెప్పారు.

https://www.youtube.com/watch?v=4PTQMTz2JCI

Advertisement

తాజావార్తలు

Advertisement