Ponguleti Srinivas Reddy | వడగాలులకు మరణించింది 16 మందే : మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో వడగాలులకు మరణించింది 16 మంది మాత్రమే అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నామని తెలిపారు.
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో వడగాలులకు మరణించింది 16 మంది మాత్రమే అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నామని తెలిపారు. ఎండల వేడిమి, వడగాల్పుల తీవ్రత నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో శనివారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు చొప్పున, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందినట్లు మంత్రి తెలిపారు. ఈ వడగాలులు మే 26వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి, ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈసారి వడగాలుల తీవ్రత అధికంగా ఉందన్నారు. బలమైన ఎల్‌నినో ప్రభావం కారణంగా వడగాలుల తీవ్రత మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతో వ్యవహరించాలని, ప్రజల ప్రాణాల రక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని మంత్రి అధికారులకు సూచించారు.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను గుర్తించి, ఆయా ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారులు, కార్మికుల సంచారం ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల్లో చల్లటి తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అత్యవసర పరిస్థితులు మినహా, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రాకూడదని మంత్రి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- ●Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా
- ●Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్గఢ్ గిరిజనుల వినూత్న లేఖ
- ●WhatsApp | వాట్సాప్లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..
- ●RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ను తీసేశారు..
- ●Lava SHARK 2 5G | రూ.11,999కే లావా షార్క్ 2 5జీ.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఏఐ కెమెరా..
- ●Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!

Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా

Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్గఢ్ గిరిజనుల వినూత్న లేఖ

WhatsApp | వాట్సాప్లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..

RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ను తీసేశారు..





