Iconic Cable Bridge | కృష్ణా నదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.. త్వరలోనే శంకుస్థాపన
Iconic Cable Bridge | కృష్ణా నది( Krishna River )పై సోమశిల( Somasila ) వద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి( Iconic Bridge ) నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనకు, ఎల్‌బీనగర్ - హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ( Nitin Gadkari ) ఆమోదం తెలిపారు.
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఆమోదం
పర్వతమాల పథకం కింద తెలంగాణకు 5 రోప్‌వేలు
ఆ హైవేలను జాతీయ హైవేలుగా మార్చేందుకు సానుకూలం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి భేటీ
Iconic Cable Bridge | త్రినేత్ర న్యూస్ : కృష్ణా నది( Krishna River )పై సోమశిల( Somasila ) వద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి( Iconic Bridge ) నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనకు, ఎల్‌బీనగర్ - హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ( Nitin Gadkari ) ఆమోదం తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు.
ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఎన్‌హెచ్ 167కే పై తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు అనుసంధానం జరిగి, రవాణా వ్యవస్థ, పర్యాటకం మెరుగుపడనుంది అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ - శ్రీశైలం ఎన్‌హెచ్ 765పై ఎలివేటెడ్ కారిడార్‌కు విజ్ఞప్తిపై నూతన డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారని పేర్కొన్నారు.

పర్వతమాల పథకం ద్వారా తెలంగాణకు 5 రోప్ వేలకు, సేతు బంధన్ పథకం ద్వారా 3 ఆర్‌వోబీలకు ఆమోదం తెలిపారు. హైదరాబాద్ - అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేపై సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో 34 పనులకు సీఆర్ఐఎఫ్ (CRIF) నిధులను మంజూరు చేయాలని మంత్రి కోరగా కేంద్ర అధికారులను ఆదేశింశారు.
పుల్లూరు - అలంపూర్ - జట్రపోలు - పెంట్లవెల్లి - కొల్లాపూర్ - లింగాల - అచ్చంపేట - డిండి - దేవరకొండ - మల్లేపల్లి - నల్గొండ రాష్ట్ర హైవేలను జాతీయ హైవేలుగా మార్చాలని కోరడంతో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌లో నవంబర్ 19-22 వరకు జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్(IRC)కు నితిన్ గడ్కరీని ఆహ్వానించగా.. సానుకూలంగా స్పందించి.. వస్తానని చెప్పినట్లు కోమటిరెడ్డి తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. సీజేపీ నేతల అరెస్ట్..
- ●MP Kirankumar Reddy | బీజేపీ చిల్లర రాజకీయాలు బంజేయాలే
- ●Singareni | సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34 శాతం చెల్లింపు
- ●Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..
- ●Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు
- ●Pooja Hegde | బుట్టబొమ్మ బర్త్‌డే ట్రీట్ - అచ్చ తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే

Cockroach Janta Party | జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. సీజేపీ నేతల అరెస్ట్..

MP Kirankumar Reddy | బీజేపీ చిల్లర రాజకీయాలు బంజేయాలే

Singareni | సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34 శాతం చెల్లింపు

Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..






