Minister Komatireddy | 22ఏ జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
Minister Komatireddy | 22ఏ నిషేధిత జాబితాలో భూముల చేర్పు వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ వ్యవహారం వెనుక కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Minister Komatireddy | 22ఏ నిషేధిత జాబితాలో భూముల చేర్పు వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ వ్యవహారం వెనుక కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర కూడా ఉండొచ్చని పేర్కొన్నారు. ‘‘22A జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు. సమగ్ర విచారణ చేస్తాం. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండవచ్చు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నాను. బాధితులకు న్యాయం చేస్తాం’’ అని మంత్రి తెలిపారు. ‘‘దరఖాస్తుల అవసరం లేదు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. పొరపాటున జరిగిందా..? కావాలనే చేశారా అన్నదానిపై విచారణ చేస్తాం’’ అని అన్నారు.
యాదగిరిగుట్టలో 42వేల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిన విషయాన్ని సీఎం దృష్టికి నాలుగు నెలల క్రితమే తీసుకెళ్లానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ‘‘కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండవచ్చు. బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయి. 30 శాతం కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘సీఎం అమెరికా టూర్ తర్వాత దీనిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం. మా ప్రభుత్వం మంచితనాన్ని కొంతమంది అధికారులు దుర్వినియోగం చేసి ఉండవచ్చు. తప్ప ఎవరిదో తేలితే వాళ్లను ఏం చేయాలో తేలుతుంది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. 22ఏ జాబితా విషయంలో మధ్యతరగతి, పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘22Aలో మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోను. ప్రతిపక్షాల విమర్శలు అర్థం లేనివి’’ అని మంత్రి కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Maharashtra Freedom of Religion Act 2026 | మహారాష్ట్రలో ఆగస్టు 28 నుంచి 'మత మార్పిడి నిరోధక చట్టం' అమలు.. గెజిట్ విడుదల, శిక్షల వివరాలు ఇవే!
- ●CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
- ●India GDP Growth | భారత ఆర్థిక వృద్ధికి బ్రేకులు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమే..
- ●Telangana Martyrs | తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం..!
- ●ICC Player of the Month | వెస్టిండీస్ ప్లేయర్ల జోరు.. గ్రీవ్స్, హేలీ మాథ్యూస్‌కు ఐసీసీ అవార్డులు
- ●FDI | ఎఫ్‌డీఐలకి భారీ ఊతం.. రూ.15 వేల కోట్లకు పెరగనున్న పరిమితి..

Maharashtra Freedom of Religion Act 2026 | మహారాష్ట్రలో ఆగస్టు 28 నుంచి 'మత మార్పిడి నిరోధక చట్టం' అమలు.. గెజిట్ విడుదల, శిక్షల వివరాలు ఇవే!

CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి

India GDP Growth | భారత ఆర్థిక వృద్ధికి బ్రేకులు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమే..

Telangana Martyrs | తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం..!





