Komatireddy Venkat Reddy | ఆరు సార్లు గెలిచా.. నేను ఎప్పుడో సీఎం కావాలే : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy | ఆరు సార్లు గెలిచాను.. నేను ఎప్పుడో సీఎం కావాలే అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవరకొండలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి కవిత పార్టీపై స్పందించారు.
Komatireddy Venkat Reddy | త్రినేత్ర.న్యూస్ : ఆరు సార్లు గెలిచాను.. నేను ఎప్పుడో సీఎం కావాలే అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవరకొండలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి కవిత పార్టీపై స్పందించారు.
కేసీఆర్ కుటుంబంలో చోటు చేసుకున్న కొట్లాటలు బయటకు రాకుండా ఉండేందుకే వరంగల్‌లో సభ పెడుతున్నారు. బీఆర్ఎస్ పెట్టే సభలతో అయ్యేది ఏం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కవిత పార్టీ పెట్టారు. ఆమె ముఖ్యమంత్రి అవుతదట.. ఆమె సీఎం అయితే నేను ఎప్పుడో సీఎం కావాల్సి ఉండే. ఆరుసార్లు గెలిచినా.. యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చాం. మా నాన్న లీడర్ కాదు, కోటీశ్వరుడు కాదు.. ఎమ్మెల్యే కాదు.. రైతు కుటుంబంలో పుట్టినా.. తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టినోని.. నేను సీఎం కాలేనా.. ఆమె కూడా ముఖ్యమంత్రి అయిత అంటుంది.. సీఎం పదవి జోక్ అయిపోయింది అని కోమటిరెడ్డి అన్నారు.
మేం అప్పు చేసి ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ స్కూల్స్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ మరో 20 ఏండ్లు అధికారంలో ఉంటుంది. ఇందులో ఎవరికి సందేహం లేదు. ఇంటర్నల్ ఇష్యూల వల్లనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఐదారు ముక్కలవుతుంది.. కాంగ్రెస్‌కు గత పదేండ్లు ఎందుకు అధికారం ఇవ్వలేదన్న బాధ ప్రజల గుండెల్లో ఉంది. వద్దన్నా కూడా 20 ఏండ్లు అధికారంలో ఉంటామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



