Jupally Krishna Rao | నీటిని విడుదల చేయాలని కోరడం విడ్డూరంగా ఉంది
Jupally Krishna Rao | త్రినేత్ర న్యూస్ : నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశామని, దీంతో అదనంగా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది అని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వదిలేసిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు నీటిని విడుదల చేయాలని కోరడం విడ్డూరంగా ఉందని మంత్రి విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టులను బీఆర్ఎస్ పూర్తి చేయలేదు..
నార్లాపూర్ నుంచి ఏదుల వరకు కాలువలు తవ్వాల్సి ఉంది
కాలువలు తవ్వకుండా నీళ్లు ఎట్ల విడుదల చేస్తారు..?
పనులు పూర్తికాకుండా నీటిని విడుదల చేయడం సాధ్యం కాదు
పనుల పూర్తికి మరో మూడు నెలల సమయం
నిరంజన్ రెడ్డి, కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
సాగునీళ్ల విడుదలపై మంత్రి జూపల్లి వ్యాఖ్యలు
Jupally Krishna Rao | త్రినేత్ర న్యూస్ : నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశామని, దీంతో అదనంగా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది అని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వదిలేసిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు నీటిని విడుదల చేయాలని కోరడం విడ్డూరంగా ఉందని మంత్రి విమర్శించారు.
నార్లాపూర్, ఎల్లూరు రిజర్వాయర్‌ల నుంచి 1000 క్యూసెక్కుల ద్వారా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటి సదుపాయం కలగనుంది. సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి జూపల్లి తెలిపారు.

రాతి నేల ఉండటంతో తవ్వకాలకు సమయం
నార్లాపూర్ నుంచి ఏదుల వరకు కాలువల తవ్వకం, బ్రిడ్జిల నిర్మాణం సహా కీలక పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అవి పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు. గతంలో అసంపూర్తిగా వదిలేసిన పనులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోకుండా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరికాదు. నార్లాపూర్ నుంచి ఏదుల వరకు కాలువల పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. మార్గమధ్యంలో మూడు చోట్ల తండు తవ్వకాలు చేపట్టాల్సి ఉండటంతోపాటు బ్రిడ్జిల నిర్మాణం కూడా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో రాతి నేల ఉండటంతో తవ్వకాలకు సమయం పడుతోంది. ఈ పనులు పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉంది. గతంలో నిలిచిపోయిన పనులను ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. కాలువల తవ్వకం, బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది అని మంత్రి స్పష్టం చేశారు.
గాలి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోకుండా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. నిర్మాణ పనులు పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే ఆశించిన ప్రయోజనం ఉండదు. ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించి వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. గాలి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలి అని జూపల్లి కృష్ణారావు సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Delhi High Court | ఫ్రాన్స్‌లో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా..?
- ●MP Laxman | విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం..
- ●Hansika | గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హన్సిక - డీ గ్లామర్ లుక్‌లో కోలీవుడ్ బ్యూటీ
- ●PPF Interest Rate | పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం.. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా?
- ●Niranjan Reddy | మంత్రి జూపల్లి సవాల్‌కు నిరంజన్ రెడ్డి సిద్దం
- ●Supreme Court | ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

Delhi High Court | ఫ్రాన్స్‌లో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా..?

MP Laxman | విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం..

Hansika | గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హన్సిక - డీ గ్లామర్ లుక్‌లో కోలీవుడ్ బ్యూటీ

PPF Interest Rate | పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం.. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా?





