త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

Supreme Court | ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌( AP Municipal Elections )పై సుప్రీంకోర్టు( Supreme Court ) సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. నామినేష‌న్లు వేయ‌ని అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని, అందుకు 48 గంట‌ల గ‌డువు వారికి ఇవ్వాల‌ని ఏపీ ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించింది.

S

National | Published On Oct 21, 2026, 3.07 pm IST

Supreme Court | ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌( AP Municipal Elections )పై సుప్రీంకోర్టు( Supreme Court ) సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. నామినేష‌న్లు వేయ‌ని అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని, అందుకు 48 గంట‌ల గ‌డువు వారికి ఇవ్వాల‌ని ఏపీ ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించింది. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా.. పోలీసు బందోబ‌స్తు కూడా క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేసింది.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 19 మున్సిపాలిటీల ప‌రిధిలో తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. వాహ‌నాల‌కు నిప్పు పెట్ట‌డం, రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేసుకోవ‌డంతో ప‌రిస్థితి హింసాత్మకంగా మారింది. ఈ క్ర‌మంలో అభ్య‌ర్థులు నామినేష‌న్ వేసేందుకు కూడా అనుకూల ప‌రిస్థితులు లేకుండా పోయాయి. హింసాత్మ‌క వాతావ‌ర‌ణం వ‌ల్ల నామినేష‌న్లు వేయ‌ని వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టు నామినేష‌న్ల‌కు 48 గంట‌ల గ‌డువు ఇవ్వాల‌ని ఆదేశించింది. వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని సూచించింది.

ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఒక్క పోలీస్ కంప్లైంట్ రాలేదని ప్రభుత్వం చెబుతుందంటే..ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మాకు అర్దం అవుతోంది. హింస జరుగుతుంటే.. లా అండ్ ఆర్డర్ లేకపోతే.. నామినేషన్లు వేయడానికి ఎవరు వస్తారు..? ప్రజాస్వామ్యంలో లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ప్రతిపక్షాలకు అవకాశం ఉండాల‌ని సుప్రీంకోర్టు పేర్కొంది.

Advertisement
Advertisement