Niranjan Reddy | మంత్రి జూపల్లి సవాల్‌కు నిరంజన్ రెడ్డి సిద్దం
Niranjan Reddy | నార్లాపూర్ రిజర్వాయర్ నుండి ఎల్లూరు రిజర్వాయర్‌కు నీళ్లు వస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయం ఫలితమే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు జూపల్లి కృష్ణారావు విడుదల చేసిన తూము నేను కేసీఆర్‌ను అడిగి పెట్టిన మూలంగానే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సాగునీళ్ల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్‌కు సిద్ధంగా ఉన్నట్లు నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎల్లూరు రిజర్వాయర్‌కు నీళ్లు..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఫలితమే
మూడేళ్ల నుంచి పాలమూరు పనులు ఆపిందేవరు..?
జూపల్లికి పాలమూరు ప్రజల ప్రయోజనాలు పట్టవు
మాకు ప్రజల ప్రయోజనాలే ముఖ్యం
తేల్చిచెప్పిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | త్రినేత్ర న్యూస్ : నార్లాపూర్ రిజర్వాయర్ నుండి ఎల్లూరు రిజర్వాయర్‌కు నీళ్లు వస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయం ఫలితమే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు జూపల్లి కృష్ణారావు విడుదల చేసిన తూము నేను కేసీఆర్‌ను అడిగి పెట్టిన మూలంగానే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సాగునీళ్ల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్‌కు సిద్ధంగా ఉన్నట్లు నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేఎల్ఐ పథకంలో తక్కువ సామర్థ్యంతో నిర్మించిన కాల్వల మూలంగా రైతాంగానికి న్యాయం జరగాలంటే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్ నుండి ఎల్లూరుకు, ఏదుల నుండి బుద్దారం కాలువకు, వట్టెం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువకు లింకు చేయడం జరిగింది. కాంగ్రెస్ అన్యాయాలను బీఆర్ఎస్ హయాంలో సరిదిద్దే ప్రయత్నం చేశాం. ఈ రోజు కూడా శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్యాకేజీ 3లో ఉన్న మట్టిని తొలగించి నీరు పారనివ్వండి. ఇప్పుడున్న పంపులు నడవడానికి ఏ ఇబ్బంది లేదు.. పది పంపులు నడిస్తే ఇబ్బందులు. ఏదుల, వట్టెంలో పంపులు సిద్దంగా ఉన్నాయి.. కరివెన వరకు నీళ్ళు తీసుకెళ్లొచ్చు. ప్రతి రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీటిని నింపే అవకాశం ఉంది. మిగిలిన పనులు వచ్చే ఏడాది పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ప్యాకేజీ 3లో అడ్డంకిగా ఉన్న మట్టి తొలగిస్తే నీళ్లు పారడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
అధికారం శాశ్వతం కాదు
మూడేళ్ల నుండి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఆపిందేవరు..? బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇచ్చిన కాలువల టెండర్లను ఎందుకు రద్దు చేశారు..? మూడేళ్ల నుండి కాలువలకు తిరిగి ఎందుకు టెండర్లు పిలవలేదు..? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఆపుతున్నదేవరు..? తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులను తెలంగాణ సాగునీటి సలహాదారులుగా నియమించుకున్నారు ఎందుకోసం..? పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని గత మూడేళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ కోరుతున్నా జూపల్లి కృష్ణారావు ఎందుకు ఒక్కసారి కూడా నోరు తెరిచి అడగలేదు? జూపల్లికి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు తప్ప పాలమూరు ప్రజల ప్రయోజనాలు పట్టవు. మాకు అధికారం ఉన్నా, లేకపోయినా పాలమూరు ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడినం, పోరాడుతున్నాం. అధికారం శాశ్వతం కాదు, ప్రజల ప్రయోజనాలే శాశ్వతం. రాజకీయాల్లో ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, కానీ ఆ అవకాశం ఇచ్చిన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తే ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ స్వీకరించి, రైతులకు ఉన్న ఇబ్బందులు తొలగించడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి సహకరించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Supreme Court | ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
- ●Lava Aura Curve 5G | లావా ఆరా కర్వ్ 5జి వచ్చేసింది.. ధర రూ.23,999..
- ●Mallikarjun Kharge on Manipur | మళ్లీ రక్తమోడుతున్న మణిపూర్: బీజేపీ అసమర్థత వల్లే ఈ దుస్థితి.. మోదీ, అమిత్ షాలకు ఖర్గే 3 ప్రశ్నలు
- ●forcibly kissing | చిన్నారులను బలవంతంగా ముద్దుపెట్టుకోవడం ప్రేమ అనిపించుకోదు.. ముంబై కోర్టు సంచలన తీర్పు
- ●Jawaharnagar dump yard | ప్రపంచంలోనే.. మీథేన్ గ్యాస్ విడుదలలో జవహర్‌నగర్ డంప్ యార్డ్ నాలుగో స్థానం
- ●Nayanthara | నయనతార వర్సెస్ సాయిపల్లవి - రామాయణకు పోటీగా మహాశక్తి

Supreme Court | ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

Lava Aura Curve 5G | లావా ఆరా కర్వ్ 5జి వచ్చేసింది.. ధర రూ.23,999..

Mallikarjun Kharge on Manipur | మళ్లీ రక్తమోడుతున్న మణిపూర్: బీజేపీ అసమర్థత వల్లే ఈ దుస్థితి.. మోదీ, అమిత్ షాలకు ఖర్గే 3 ప్రశ్నలు

forcibly kissing | చిన్నారులను బలవంతంగా ముద్దుపెట్టుకోవడం ప్రేమ అనిపించుకోదు.. ముంబై కోర్టు సంచలన తీర్పు






