త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Laxman | విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం..

MP Laxman | విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం సృష్టించే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని రాజ్య‌స‌భ ఎంపీ డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్( MP Laxman ) మండిప‌డ్డారు. కాంగ్రెస్, కాక్రోచ్ జ‌నతా పార్టీ నేతృత్వంలో జ‌రుగుతున్న నిర‌స‌న‌లు దేశ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ఉన్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Oct 21, 2026, 3.48 pm IST

MP Laxman | విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం..
Advertisement

ఇండీ కూట‌మి ప్ర‌చారాన్ని తిప్పికొడుతాం
అక్టోబ‌ర్ 23 నుంచి న‌వంబ‌ర్ 5 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా కార్య‌క్ర‌మాలు
మీడియాకు వెల్ల‌డించిన రాజ్య‌సభ ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌

MP Laxman | త్రినేత్ర న్యూస్ : విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం సృష్టించే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని రాజ్య‌స‌భ ఎంపీ డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్( MP Laxman ) మండిప‌డ్డారు. కాంగ్రెస్, కాక్రోచ్ జ‌నతా పార్టీ నేతృత్వంలో జ‌రుగుతున్న నిర‌స‌న‌లు దేశ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ఉన్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఎంపీ ల‌క్ష్మ‌ణ్ మీడియాతో మాట్లాడారు.

అధికార‌మే ముఖ్యం.. దేశం ఏమైనా ఫ‌ర్వాలేద‌నే ధోర‌ణిలో రాహుల్ గాంధీ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని నిప్పులు చెరిగారు. ఇండీ కూట‌మి త‌ప్పుడు ప్ర‌చారాన్ని తిప్పికొట్టేందుకు ఈ ఏడాది అక్టోబ‌ర్ 23 నుంచి న‌వంబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు దేశ వ్యాప్తంగా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌తిప‌క్ష పార్టీల మోసాన్ని వివ‌రిస్తామ‌న్నారు. ఆధారాల‌తో విమ‌ర్శ‌లు చేయొచ్చు.. కానీ బ‌ట్ట‌కాల్చి మీద వేస్తామంటే ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని హెచ్చ‌రించారు. ఈ తీరును దేశ యువ‌త గ‌మ‌నించాల‌న్నారు. స‌ర్‌తో ఓట్లను ప్రక్షాళన చేస్తే విపక్షాలకు వచ్చిన సమస్యేంటీ? అని నిల‌దీశారు. చనిపోయిన వారికీ కూడా ఓటు ఉండాలా? అని ప్ర‌శ్నించారు. వీట‌న్నింటిపై ఎన్నిక‌ల సంఘం స్పష్ట‌త‌నిచ్చినా కూడా.. 13 కోట్ల ఓట్లు చేర్చాలంటూ రాహుల్ గాంధీ వితండ‌వాదం చేయ‌డం స‌రికాద‌న్నారు. పోనీ తొల‌గించిన ఓట్ల‌పై ఆధారాలు చూపించ‌మ‌ని అడిగితే రాహుల్ గాంధీ వ‌ద్ద స‌మాధానం లేద‌ని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement