త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jupally Krishna Rao | టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూప‌ల్లి.. వైర‌ల్‌

Jupally Krishna Rao | నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి రెవెన్యూ కార్యాలయంలో రాష్ట్ర‌ ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టాయిలెట్ల‌ను శుభ్రం చేశారు. అధికారుల నిర్ల‌క్ష్యంపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ తానే స్వ‌యంగా నీళ్లు పోసి శుభ్రం చేసి వారికి క‌నువిప్పు క‌లిగించారు.

S

Telangana | Published On Aug 21, 2026, 6.15 pm IST

Jupally Krishna Rao | టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూప‌ల్లి.. వైర‌ల్‌
Advertisement

Jupally Krishna Rao | త్రినేత్ర‌.న్యూస్‌: నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి రెవెన్యూ కార్యాలయంలో రాష్ట్ర‌ ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టాయిలెట్ల‌ను శుభ్రం చేశారు. ఆక‌స్మిక త‌నిఖీ చేసేందుకు వెళ్లిన స‌మ‌యంలో టాయిలెట్లు అప‌రిశుభ్రంగా ఉండ‌డాన్ని గ‌మ‌నించారు. దీంతో అధికారుల నిర్ల‌క్ష్యంపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ తానే స్వ‌యంగా నీళ్లు పోసి శుభ్రం చేసి వారికి క‌నువిప్పు క‌లిగించారు. ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యాయి.

ఈ సంద‌ర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన రెవెన్యూ వినతులపై అధికారుల‌తో క‌లిసి ఆయ‌న స‌మీక్ష చేపట్టారు. ఫైళ్ల పరిష్కారంలో జాప్యంపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తున్న అన్ని ఫైళ్ల‌ను జాప్యం చేస్తున్నార‌ని కొల్లాపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి బన్సిలాల్‌పై ఆగ్రహించారు. అర్జీలను ప‌రిశీలించారు.

Advertisement
Advertisement