Sowcar Janaki | దేవదాస్‌లో ఛాన్స్ మిస్…కన్నడ స్టార్‌కు తల్లిగా…హీరోయిన్‌గా…షావుకారు జానకి
సీనియర్ సినీ నటి షావుకారు జానకి మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఏపీలో పుట్టిన షావుకారు జానకి తెలుగులో కంటే తమిళం, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా ఎక్కువగా సినిమాలు చేసింది. కన్నడ అగ్ర హీరో రాజ్‌కుమార్ సరసన హీరోయిన్‌గా నటించింది. రాజ్‌కుమార్ చివరి మూవీలో అతడికి తల్లిగా కనిపించింది
Entertainment | Published On Aug 21, 2026, 5.47 pm IST
Sowcar Janaki | షావుకారు జానకి మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 1949తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జానకి 2023 వరకు సినిమాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. జానకి ఫ్యామిలీలో చాలా మంది యాక్టర్లు ఉన్నారు. ఆమె చెల్లెలు కృష్ణకుమారి దక్షిణాదిలో అగ్ర నాయికగా పేరుతెచ్చుకోగా....మనవరాలు వైష్ణవి కూడా హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశారు.
హీరోయిన్‌గా...తల్లిగా...
ఏపీలో పుట్టిన జానకి తెలుగు కంటే తమిళం, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా ఎక్కువగా సినిమాలు చేసింది. కన్నడ అగ్ర నటుడు రాజ్‌కుమార్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ మహిషాసుర మర్ధినిలో షావుకారు జానకి హీరోయిన్‌గా నటించింది. రాజ్‌కుమార్ చివరి మూవీలో శద్దవేదిలో అతడికి తల్లిగా కనిపించింది. కన్యారత్న సినిమాలో రాజ్‌కుమార్ చెల్లెలిగా కనిపించింది. తెలుగులో ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ మూవీ రాజ మలయ సింహం సినిమాలో షావుకారు జానకి హీరోయిన్. తమిళంలో కే బాలచందర్ డైరెక్షన్‌లోనే పదమూడు సినిమాలు చేశారు.
దేవదాస్‌లో...
ఏఎన్నార్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన దేవదాస్‌లో తొలుత హీరోయిన్‌గా షావుకారు జానకిని తీసుకున్నారు. రిహార్సల్స్‌లో ఆమె పాల్గొన్నారు. రేపటి నుంచి షూటింగ్ అనగా జానకిని తీసేసి ఆమె ప్లేస్‌లో సావిత్రిని హీరోయిన్‌గా తీసుకున్నారు. కనీసం కారణం కూడా చెప్పలేదని ఓ ఇంటర్వ్యూలో జానకి పేర్కొన్నారు.
శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం....
బాలనటిగా శ్రీదేవిని షావుకారు జానకి ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వాహిని స్టూడియోలో ఓ సినిమా షూటింగ్ చూడటానికి ఆరేళ్ల వయసున్న శ్రీదేవి వచ్చింది. సినిమాలో బాలమురుగన్ పాత్ర కోసం మేకర్స్ చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్నారని తెలిసి శ్రీదేవిని వారికి చూపించింది షావుకారు జానకి. లుక్ టెస్ట్ చేసి శ్రీదేవిని మేకర్స్ ఆ పాత్ర కోసం తీసుకున్నారు. అలా శ్రీదేవి సినీ రంగ ప్రవేశం జానకి వల్లే జరిగింది.
తాజావార్తలు
- ●Atomberg IPO | ఆటంబర్గ్ ఐపీవో వచ్చేస్తోంది.. ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి..
- ●Jannaram | ఇంటి నెంబర్ కోసం డబ్బులు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
- ●Supreme Court | యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ●Revanth Reddy | తరుణ్ గొగోయ్.. కేజ్రీవాల్.. అర్జున్ ముండా.. రేవంత్ రెడ్డి
- ●Malaria | ఇక దోమకాటుతో మలేరియాకు అడ్డుకట్ట.. సైంటిస్టుల వినూత్న ప్రయోగం..
- ●Ramchandar Rao | అమెరికా టూర్‌కు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే.. రాంచందర్‌రావు ఏమన్నారంటే..

Atomberg IPO | ఆటంబర్గ్ ఐపీవో వచ్చేస్తోంది.. ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి..

Jannaram | ఇంటి నెంబర్ కోసం డబ్బులు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Supreme Court | యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Revanth Reddy | తరుణ్ గొగోయ్.. కేజ్రీవాల్.. అర్జున్ ముండా.. రేవంత్ రెడ్డి



