త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Tapping Case | ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్ప‌డిన‌వారికి శిక్ష‌త‌ప్ప‌దు: మంత్రి శ్రీధ‌ర్ బాబు

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగుకు (Phone Tapping Case) పాల్ప‌డిన‌వారికి శిక్ష త‌ప్ప‌ద‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని తెలిపారు.

G

Telangana | Published On Feb 2, 2026, 11.58 am IST

Phone Tapping Case | ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్ప‌డిన‌వారికి శిక్ష‌త‌ప్ప‌దు: మంత్రి శ్రీధ‌ర్ బాబు
Advertisement

Phone Tapping Case | త్రినేత్ర‌.న్యూస్‌: ఫోన్ ట్యాపింగుకు (Phone Tapping Case) పాల్ప‌డిన‌వారికి శిక్ష త‌ప్ప‌ద‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని తెలిపారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా? వద్దా? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చిందన్నారు. తప్పుచేసి మ‌ళ్లీ త‌మ‌పైనే అభియోగాలు మోపుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సీఎం రేవంత్‌ రెడ్డికి ఎవరి మీదా కక్ష సాధింపు ఆలోచన లేదని స్ప‌ష్టం చేశారు. సాధారణంగా ఉగ్రవాదులు, సంఘ‌విద్రోహ శ‌క్తుల‌ ఫోన్లను ట్యాప్ చేస్తారని.. కానీ ఇక్కడ జ‌డ్జిలు, వ్యాపారవేత్తలు, నాయ‌కుల ఫోన్లను ట్యాప్ చేశార‌ని మండిప‌డ్డారు. ఆధారాలు లభించడంతోనే విచారణ జరుగుతున్న‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు, ఎందుకు చేశార‌ని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

బీజేపీ ఎంపీలు ధ‌ర్మ‌పురి అర్వింద్‌, కొండ విశ్వేశ్వ‌ర్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేయాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. వారి కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని చెప్పార‌న్నారు. అది చేసిందెవ‌రో తేల్చేందుకు విచార‌ణ జ‌రుగుతున్న‌ద‌ని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement