Damodar Raja Narasimha | ఎడ్యుకేషన్ హబ్‌గా అందోల్.. త్వరలో ఫార్మసీ కాలేజీ ఏర్పాటు : మంత్రి దామోదర
Damodar Raja Narasimha | అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, త్వరలోనే ఫార్మసీ కాలేజీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, సమగ్ర వైద్య సేవలను అందించడమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు.
Damodar Raja Narasimha | త్రినేత్ర.న్యూస్ : అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, త్వరలోనే ఫార్మసీ కాలేజీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, సమగ్ర వైద్య సేవలను అందించడమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం అందోల్ - జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, సమగ్ర వైద్య సేవలను అందించడమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య సేవలు అందించే దిశగా ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరిస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలందించేందుకు ట్రామా, ఎమర్జెన్సీ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. గతంలో పావలా వడ్డీ పథకం, అనంతరం వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం మహిళలకు ఇందిరమ్మ క్యాంటీన్లు, సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులు వంటి వనరులను కేటాయిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందిస్తున్నామని వివరించారు.
ప్రతి పాఠశాల, కళాశాలలో ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పౌష్టికాహారం, అవసరమైన అన్ని సౌకర్యాలను అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందోల్ ప్రాంతంలో త్వరలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అందోల్ నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా (ఎడ్యుకేషన్ హబ్‌గా) అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
అలాగే సింగూర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. 200 కోట్ల రూపాయలతో సింగుర్ లైన్ పనులు మొదలయ్యాయని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ,స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారిులు, ప్రజలు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



