త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | గ‌ల్లీ గ‌ల్లీలో స‌తీష్ స్వ‌ర‌మే..! గెలుపు ఏ అభ్య‌ర్థిని వ‌రిస్తుందో..!!

Municipal Elections | పంచాయ‌తీ నుంచి పార్ల‌మెంట్ వ‌ర‌కు.. ఎన్నిక ఏదైనా స‌రే.. ఆ ఎన్నిక‌ల‌కు బ‌లం పాట‌లు, స్వ‌రాలే. ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా.. ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క‌లాపాల‌ను రూపొందించుకుంటారు. ఇందులో ప్ర‌ధాన‌మైన‌వి పాట‌లు, స్వ‌రాలు.

S

Telangana | Published On Feb 10, 2026, 7.58 am IST

Municipal Elections | గ‌ల్లీ గ‌ల్లీలో స‌తీష్ స్వ‌ర‌మే..! గెలుపు ఏ అభ్య‌ర్థిని వ‌రిస్తుందో..!!
Advertisement

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్ : పంచాయ‌తీ నుంచి పార్ల‌మెంట్ వ‌ర‌కు.. ఎన్నిక ఏదైనా స‌రే.. ఆ ఎన్నిక‌ల‌కు బ‌లం పాట‌లు, స్వ‌రాలే. ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా.. ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క‌లాపాల‌ను రూపొందించుకుంటారు. ఇందులో ప్ర‌ధాన‌మైన‌వి పాట‌లు, స్వ‌రాలు. ఇక అధికార పార్టీ అయితే త‌మ అభివృద్ది, సంక్షేమాన్ని పాట‌ల రూపంలో తెలియ‌జేస్తూ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అదే ప్ర‌తిప‌క్ష పార్టీ అయితే.. అధికార ప‌క్షం త‌ప్పుల‌ను, నెర‌వేర్చ‌ని హామీల‌ను ఎండ‌గ‌డుతూ.. పాట‌ల‌ను రూపొందించి.. ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తుంటాయి. పాట‌లు ఒక్క‌టే కాదు.. మాట‌ల‌కు కూడా ప‌దును పెడుతారు. పాట‌కు తోడు పదునైన మాట‌ల‌తో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అయితే అటు పాట‌లు పాడే వారి స్వ‌రం, ఇటు మాట‌లు మాట్లాడే వారి స్వ‌రం గంభీరంగా ఉంటేనే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ స్వ‌రం అనేది ఎన్నిక‌ల గెలుపోట‌ముల‌లో కీల‌క‌పాత్ర పోషిస్తుంద‌న‌డంలో సందేహం లేనే లేదు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌చ్చిందంటే.. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మున్సిపాలిటీలో ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. చెన్నూరు పట్టణంలోని ఏ గల్లీలో విన్నా ఒకటే స్వరం.. ప్రచారం వివిధ పార్టీల అభ్యర్థులదైతే గొంతు మాత్రం చెన్నూరు పట్టణానికి చెందిన మిమిక్రీ(పెండ్యాల) సతీష్‌ది కావడం విశేషం.

ఎన్నిక‌ల హడావుడి మొద‌లైన‌ప్ప‌టి నుంచి నిన్న‌టి వ‌ర‌కు స‌తీష్ తీరిక లేకుండా గ‌డిపారు. 4వ తేదీ నుంచి నిన్న‌టి వ‌ర‌కు18 వార్డుల్లో సతీష్‌ తయారు చేసిన ఎన్నికల వాయిస్‌ రికార్డే వినబడింది. చెన్నూరు మున్సిపాల్టీలో ఒక్కరిద్దరు అభ్యర్థులు మినహా మిగతా వారందరి ప్రచారంలో వాయిస్‌ రికార్డు సతీష్‌దే కావడం గమనార్హం. ఈ పుర ఎన్నికల్లో చెన్నూరుతో పాటు రంగారెడ్డి, నిజామాబాద్, కొడంగల్, కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం తదితర పురపాలికల్లో సుమారు 105 మంది అభ్యర్థులకు ఆయన ఎన్నికల వాయిస్‌ రికార్డు అందజేశారు.

Advertisement
Advertisement