Harish Rao | దివ్యాంగులకు ఉపాధినిస్తున్న సంస్థకూ బిల్లులు చెల్లించరా?
Harish Rao | దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థకు కూడా రెండేళ్లుగా బిల్లులు (Bills) చెల్లించకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు (Harish Rao) మండిపడ్డారు.
- వెంటనే రూ.16 లక్షల పెండింగ్ బిల్లులు విడుదల చేయండి
- మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
Harish Rao | త్రినేత్ర న్యూస్: దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థకు కూడా రెండేళ్లుగా బిల్లులు (Bills) చెల్లించకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు (Harish Rao) మండిపడ్డారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లాకు చెందిన జుబేదా బేగం దివ్యాంగ్ సోలార్ సొసైటీ (Zubeda Begum Divyang Solar Society), దివ్యాంగ్ గార్మెంట్స్(Divyang Garments)ను స్థాపించి దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.16 లక్షల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా మాట్లాడారు.
ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లకు దుస్తులు కుట్టి సరఫరా చేసినందుకు రావాల్సిన రూ.16 లక్షల బిల్లులు గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతాలు ఇవ్వలేక సతమతమవుతున్నారు. బ్యాంకు లోన్లు కట్టకపోవడంతో సంస్థకు తాళాలు వేసే దుస్థితి వచ్చింది.
దివ్యాంగులు, నిరుపేద మహిళల శ్రమకు సంబంధించిన బిల్లులను కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటు. దివ్యాంగుల సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, వారి కష్టార్జితాన్ని చెల్లించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది? ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేసి, బాధితులకు న్యాయం చేయాలి అని హరీశ్ రావు కోరారు.
సంబంధిత వార్తలు

BRS | ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్లో చేరిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే
అక్టోబర్ 25, 2026

Software Employee | మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..
అక్టోబర్ 25, 2026

Unable To Pay Rent | కిరాయి కట్టలేక.. రూ.37 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు ముద్రించాడు!
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●BRS | ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్లో చేరిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే
- ●Software Employee | మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..
- ●Unable To Pay Rent | కిరాయి కట్టలేక.. రూ.37 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు ముద్రించాడు!
- ●Dowry Assault | థార్ కారు, బైక్ కొనివ్వలేదని.. భార్యను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన భర్త
- ●Revanth Reddy | రక్షణ రంగంలో భారత్‌ను అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్
- ●Special Trains | చర్లపల్లి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. పలు సర్వీసులు పొడిగింపు..

BRS | ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్లో చేరిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే

Software Employee | మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..

Unable To Pay Rent | కిరాయి కట్టలేక.. రూ.37 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు ముద్రించాడు!

Dowry Assault | థార్ కారు, బైక్ కొనివ్వలేదని.. భార్యను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన భర్త



