త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MGU PhD Notification | ఎంజీయూ పీహెచ్‌డీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఆగ‌స్టు 20 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు..!

MGU PhD Notification | మీరు ఎంఏ, ఎమ్మెస్సీ, బిజినెస్ మేనెజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేశారా..? ఆ త‌ర్వాత పీహెచ్‌డీ( PhD ) చేయాల‌నుకుంటున్నారా..? అది కూడా పేరొందిన యూనివ‌ర్సిటీల్లో చేయాల‌నుకుంటే.. న‌ల్ల‌గొండ‌( Nallagonda )లోని మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేష‌న్‌( MGU PhD Notification )ను విడుద‌ల చేసింది. నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇలా..

S

Telangana | Published On Jul 31, 2026, 7.26 pm IST

MGU PhD Notification | ఎంజీయూ పీహెచ్‌డీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఆగ‌స్టు 20 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు..!
Advertisement

MGU PhD Notification | త్రినేత్ర‌.న్యూస్ : న‌ల్ల‌గొండ‌( Nallagonda )లోని మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేష‌న్‌( MGU PhD Notification )ను శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఈ మేర‌కు వివిధ విభాగాల్లో పీహెచ్‌డీకి అవ‌కాశం క‌ల్పిస్తూ ఎంజీయూ యూనివ‌ర్సిటీ( MG University ) వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలతో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. యూనివ‌ర్సిటీ నిబంధ‌న‌ల మేర‌కు కేట‌గిరి-1, కేట‌గిరి-2ల్లో ప్ర‌వేశాల‌ను క‌ల్పించ‌నున్నారు.

ఏయే విభాగంలో ఎన్ని సీట్లు ఖాళీ అంటే..?

  • కామ‌ర్స్ - 01
  • కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇన్ఫ‌ర్మెటిక్స్ - 13
  • బిజినెస్ మేనెజ్‌మెంట్ - 18
  • బ‌యోకెమిస్ట్రీ - 08
  • బ‌యోటెక్నాల‌జీ - 05
  • కెమిస్ట్రీ - 31
  • మ్యాథ‌మేటిక్స్ - 08
  • ఎకనామిక్స్ - 06
  • ఇంగ్లీష్ - 02

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఎప్పుడంటే..?

  • అర్హులైన అభ్య‌ర్థులు ఆగ‌స్టు 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తు ఫీజు ఎంతంటే..?

  • ఓపెన్ కేట‌గిరి అభ్య‌ర్థుల‌కు రూ. 2000
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ. 1500

త‌దిత‌ర వివ‌రాల కోసం యూనివ‌ర్సిటీ వెబ్‌సైట్‌ను https://www.mguniversity.ac.in/ సంద‌ర్శించొచ్చు. 

Advertisement
Advertisement