Meru Caste | కుట్టుపని కాంట్రాక్టుల్లో మేరు కులస్తులకు 40 శాతం కేటాయించాలి.. పీసీసీ చీఫ్‌కు విజ్ఞప్తి
Meru Caste | ప్రభుత్వ సంస్థల్లోని విద్యార్థులు, సిబ్బందికి అందిస్తున్న యూనిఫాంలు ఇతర కుట్టుపని కాంట్రాక్టులలో ప్రభుత్వం మేరు కులస్తులకు 40 శాతం కేటాయించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను మేరు సంఘం రాష్ట్ర నాయకులు కోరారు.
Meru Caste | త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వ సంస్థల్లోని విద్యార్థులు, సిబ్బందికి అందిస్తున్న యూనిఫాంలు ఇతర కుట్టుపని కాంట్రాక్టులలో ప్రభుత్వం మేరు కులస్తులకు 40 శాతం కేటాయించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను మేరు సంఘం రాష్ట్ర నాయకులు కోరారు.
మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కీర్తి రాజ్ గోపాల్ మేరు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.వెంకటేష్ మేరు తదితరులు శనివారం మహేష్ కుమార్ గౌడ్‌ను నార్సింగ్‌లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కుట్టు పని పైనే జీవన ఆధారంగా జీవిస్తున్న మేరు కుటుంబాలు నేడు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. మేరు కులానికి చెందిన అనేక కుటుంబాలు తమ దైనందిన ఆదాయం కోసం పూర్తిగా ఈ వృత్తిపైనే ఆధారపడి ఉన్నాయని అన్నారు. మేరు కులస్తులు చిన్న తరహా రెడీమేడ్ వస్త్రాల తయారీ మరియు కుట్టుపని కేంద్రాలను స్థాపించేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని తద్వారా వారు తమ సంప్రదాయ వృత్తిని విస్తరించుకోవడతో పాటు తమకు మరియు ఇతరులకు ఉపాధిని కల్పించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.
గత ప్రభుత్వ విధానాన్ని కొనసాగించండి
ప్రభుత్వం ప్రస్తుతం పాఠశాలలు,కళాశాలలు,అంగన్వాడీ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ సంస్థలలోని విద్యార్థులు సిబ్బందికి యూనిఫాంలు సరఫరా చేస్తున్నారని వాటి కుట్టుపని కోసం ప్రభుత్వం టెండర్లు కేటాయించేటప్పుడు కుట్టు పనిని తమ సంప్రదాయ జీవనోపాధిగా కలిగిన అర్హులైన మేరు కులస్తులకు కనీసం 30 నుండి 40 శాతం వరకు పనిని ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు. గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో కూడా ప్రభుత్వం యూనిఫాంల కుట్టు పనిలో మేరు కులస్తులకు కేటాయించిందని మహేష్ కుమార్ దృష్టికి తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగించాలని అలాగే మా కులస్తులకు మరింత మెరుగైన జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా దీనిని 30 నుండి 40 శాతం వరకు పెంచాలని కోరారు.
మేరు కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, ఇతర సంప్రదాయ వృత్తుల వారి అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు చేనేత కార్మికులు, గీత కార్మికుల వంటి ఇతర సంప్రదాయ వృత్తుల వర్గాలకు ప్రభుత్వం సంక్షేమ, జీవనోపాధి పథకాలను ఎలాగైతే వర్తింపజేస్తుందో అదే విధంగా మేరు కులస్తులకు కూడా అటువంటి ప్రాధాన్యత, మద్దతును కల్పించాలని రాజ్ గోపాల్, వెంకటేష్ లు కోరారు. మేరు కుల వృత్తుల సమస్యలపై రాబోయే శాసనసభ సమావేశలలో ఈ విషయాన్ని దయచేసి లేవనెత్తి మా నిజమైన డిమాండ్ ను సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకొని వెళ్ళి మేరు కుల భవిష్యత్తు తరాలకు ఉపాధి అవకాశాలను కల్పించాలని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●MP Mallu Ravi | మాక్ అసెంబ్లీ రాజకీయ డ్రామా కాదా..?
- ●Anushka Sharma | బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీకి సీక్వెల్ - గెస్ట్ రోల్స్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ
- ●Ekta Mall Telangana | రూ.200 కోట్ల 'ఏక్తా మాల్' ప్రైవేట్ బిల్డర్ల జేబుల్లోకి? శాసనమండలిలో సర్కార్‌ను నిలదీసిన దాసోజు శ్రవణ్
- ●Kalwakuntla Kavitha | అసెంబ్లీని అడ్వర్టైజెమెంట్ కోసం వాడుకుంటున్నడు
- ●CM Revanth Reddy | అతిథుల వివరాలను అందించండి.. గణేశ్ మండప నిర్వాహకులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
- ●NSE IPO | ఎన్ఎస్ఈ ఐపీఓకు సబ్‌స్క్రైబ్ చేయాలా.. నిపుణులు ఏమంటున్నారు..?

MP Mallu Ravi | మాక్ అసెంబ్లీ రాజకీయ డ్రామా కాదా..?

Anushka Sharma | బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీకి సీక్వెల్ - గెస్ట్ రోల్స్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ

Ekta Mall Telangana | రూ.200 కోట్ల 'ఏక్తా మాల్' ప్రైవేట్ బిల్డర్ల జేబుల్లోకి? శాసనమండలిలో సర్కార్‌ను నిలదీసిన దాసోజు శ్రవణ్

Kalwakuntla Kavitha | అసెంబ్లీని అడ్వర్టైజెమెంట్ కోసం వాడుకుంటున్నడు




