Mega Job Mela | మే 4న ఖమ్మం పట్టణంలో మెగా జాబ్ మేళా
Mega Job Mela | రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చే నెల 4న ఖమ్మంలోని ఎస్సార్ గార్డెన్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేస్తున్న ఈ మేళాకు సుమారు 80 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.
Mega Job Mela | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చే నెల 4న ఖమ్మంలోని ఎస్సార్ గార్డెన్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేస్తున్న ఈ మేళాకు సుమారు 80 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో జరిగిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్భార్ లో పొంగులేటి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాబ్ మేళా సావనీర్ ను ఆవిష్కరించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ జాబ్ మేళా అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అనే 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి శాఖకు సంబంధించిన ప్రజా సమస్యలను అధిగమించేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వయంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కారమార్గం చూపిస్తున్నామని వివరించారు. న్యాయబద్ధమైన ప్రతి సమస్యను ప్రణాళికబద్ధంగా మూడు నెలల వ్యవధిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ధరణికి సంబంధించిన సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో మొట్టమొదటి భూభారతి చట్టంలో భాగంగా సర్వే మ్యాప్ తో కూడిన రిజిస్ట్రేషన్ పాలేరు నియోజకవర్గంలో జరగడం చాలా సంతోషం. రానున్న నలభై రోజుల్లో సాదాబైనామాల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న, వరిధాన్యం పంటలు కనివినీ ఎరుగని రీతిలో దిగుబడులు వచ్చాయని, ప్రభుత్వం వాటిని యుద్ధ ప్రాతిపదిక కొనుగోలు చేయడంతో పాటు, రైతు ఖాతాల్లో ఎప్పటికప్పుడు పైసలు జమ చేస్తోందని వివరించారు. రైతులు మెండుగా వ్యవసాయం చేసుకుంటే కొందరు ఓర్వలేని తీరుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉనికి కోల్పోతున్నామని ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో కడుపునిండా విషం పెట్టుకొని అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అవాకులు చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. వాస్తవానికి.. వారు మాట్లాడేదానికి.. చాలా తేడా ఉందన్నారు. గ్రౌండ్ చూడకుండా గుడ్డిగా మాట్లాడటం ప్రతిపక్షనాయకులకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



