Allam Narayana | త్రినేత్ర.న్యూస్ : డెస్కు జర్నలిస్టులకు మీడియా కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణలోని జర్నలిస్టులందరూ పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట జర్నలిస్టులు నిరసనకు దిగారు. కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులపై మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మండిపడ్డారు. ముషీరాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించిన జర్నలిస్టులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో శ్రీనివాస్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. మేం రాజకీయాలు చేస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి అనడం సరికాదు. అక్రిడిటేషన్ అనేది జర్నలిస్టుల హక్కు. ఈ హక్కును రేవంత్ రెడ్డి జాగ్రత్తగా గమనించాలి. మేం సాధించుకున్న హక్కును తీసుకోకండి. మీరు కొత్తగా అక్రిడిటేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మేం మాట్లాడడం లేదు. 252 జీవోను సీఎం రేవంత్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి పరిశీలించాలి అని అల్లం నారాయణ సూచించారు. జర్నలిస్టుల హక్కుల గురించి మాట్లాడే రైట్ మాకుంది. మీ పాలనకు సంబంధించిన పోస్టుమార్టం గురించి మేం మాట్లాడడం లేదు. జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతుంది కాబట్టి ఒక జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మా హక్కులను అడుగుతున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. సీఎం రేవంత్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి. 10 వేల మందికి మాత్రమే అక్రిడిటేషన్, మీడియా కార్డులు ఇవ్వాలనుకోవడం సరికాదు. డెస్కు జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులే ఇవ్వాలి. మీడియా కార్డులనే విభజన రాకూడదు. నియోజకవర్గ స్థాయిలోని విలేకరులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి. ఇంతకుముందున్న 23 వేల అక్రిడిటేషన్ కార్డులను అలానే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరిచ్చిన ఏడో హామీని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తామంటే జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది సబబు కాదు అని అల్లం నారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్లో జర్నలిస్టుల అరెస్ట్ హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద అక్రిడిటేషన్ కార్డుల కోసం జర్నలిస్టులు చేస్తున్న ధర్నాను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, మీడియాతో మాట్లాడుతున్న మాజీ ప్రెస్ అకాడమీ… pic.twitter.com/PC2FINM2qz — Telugu Scribe (@TeluguScribe) December 27, 2025