త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రైతు సంగ్రామ సదస్సులో వ్యాఖ్య‌లు.. కేటీఆర్‌పై క్రిమిన‌ల్ కేసు..

KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (KTR) సుబేదారి పోలీసు స్టేషన్‌లో క్రిమిన‌ల్‌ కేసు నమోదైంది. బుధ‌వారం (మే 6న‌) హనుమకొండలో (Hanumakonda) నిర్వ‌హించిన‌ రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్‌రెడ్డిని (Revanth Reddy) ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేటీఆర్‌పై పోలీసులు కేసు ఫైల్‌ చేశారు.

G

Telangana | Published On May 7, 2026, 9.16 am IST

KTR | రైతు సంగ్రామ సదస్సులో వ్యాఖ్య‌లు.. కేటీఆర్‌పై క్రిమిన‌ల్ కేసు..
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (KTR) సుబేదారి పోలీసు స్టేషన్‌లో క్రిమిన‌ల్‌ కేసు నమోదైంది. బుధ‌వారం (మే 6న‌) హనుమకొండలో (Hanumakonda) నిర్వ‌హించిన‌ రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్‌రెడ్డిని (Revanth Reddy) ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేటీఆర్‌పై పోలీసులు కేసు ఫైల్‌ చేశారు.

అత్యున్న‌త ప‌ద‌వుల్లో ఉన్న వ్య‌క్తుల‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేంద‌ర్ రెడ్డి (వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌), కేఆర్ నాగ‌రాజు (వ‌ర్ధ‌న్న‌పేట‌), డీసీసీ అధ్య‌క్షుడు ఇనుగాల వెంక‌ట్రామ్‌రెడ్డి సుబేదారీ పోలీసుల‌కు కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు.

దీంతో కాంగ్రెస్ నేతల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేటీఆర్‌పై 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా శాంతిభద్రతలకు భంగం కలిగించడం), 505 (ప్రజల్లో అశాంతిని లేదా అలజడిని సృష్టించేలా ప్రకటనలు చేయడం) సెక్షన్ల కింద క్రిమిన‌ల్ కేసులు నమోదు చేశారు. దీంతో హనుమకొండ, వరంగల్ పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్క‌సారిగా వేడెక్కింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement