త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Madhusudhana Chary | హ‌న్మ‌కొండ చౌర‌స్తాలో ఉరేసుకుంటా.. మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MLC Madhusudhana Chary | ఆరు గ్యారెంటీలు అమ‌లైన‌ట్టు నిరూపిస్తే.. త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తామ‌ని ఇప్ప‌టికే ప‌లువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. తాజాగా మాజీ స్పీక‌ర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి ఓ అడుగు ముందుకేసి.. ఉరేసుకుంటాన‌ని బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు.

S

Telangana | Published On Apr 5, 2026, 5.12 pm IST

MLC Madhusudhana Chary | హ‌న్మ‌కొండ చౌర‌స్తాలో ఉరేసుకుంటా.. మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

MLC Madhusudhana Chary | త్రినేత్ర‌.న్యూస్ : ఆరు గ్యారెంటీల అమ‌లుపై అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య ర‌గడ కొన‌సాగుతూనే ఉంది. ఆరు గ్యారెంటీలు అమ‌లు చేశామ‌ని అధికార కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. ఆరు గ్యారెంటీలు అమ‌లు కాలేద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీ చెబుతుంది. ఆరు గ్యారెంటీలు అమ‌లైన‌ట్టు నిరూపిస్తే.. త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తామ‌ని ఇప్ప‌టికే ప‌లువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. తాజాగా మాజీ స్పీక‌ర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి ఓ అడుగు ముందుకేసి.. ఉరేసుకుంటాన‌ని బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు.

భార‌త మాజీ ఉప ప్ర‌ధాని బాబు జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి సంద‌ర్భంగా.. ఆయ‌న చిత్ర‌ప‌టానికి మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా మ‌ధుసూద‌నాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌జ‌ల విశ్వాసం మీద దాడి జ‌రుగుతుంది. ఛాలెంజ్ చేయ‌డ‌మ‌నేది మంచిది కాదు కానీ నేను సూచన చేస్తున్నా.. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఆరు గ్యారెంటీలు అమ‌లు చేసిన‌ట్టు రెఫ‌రెండం పెట్టి తేల్చితే, అది నిజమైతే హ‌న్మ‌కొండ చౌర‌స్తాలో నేను ఉరేసుకుంటా.. ఇది బాధ‌తో చెబుతున్నాను. చాలెంజ్ కాదు అని మ‌ధుసూద‌నాచారి పేర్కొన్నారు.

Advertisement
Advertisement