Medaram Jatara | భక్తుల జయజయధ్వానాల మధ్య.. జనం నుంచి వనంలోకి..
Medaram Jatara | నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగిన మేడారం మహా జాతర (Medaram Jatara) ముగిసింది. ఆరాధ్య దైవాలు సమక్క సారలమ్మలను (Sammakka Saralamma) దర్శికుని కోట్లాది మంది భక్తులు తరించిపోయారు. అమ్మలకు నిలువెత్తు బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
త్రినేత్ర.న్యూస్: నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగిన మేడారం మహా జాతర (Medaram Jatara) ముగిసింది. ఆరాధ్య దైవాలు సమక్క సారలమ్మలను (Sammakka Saralamma) దర్శికుని కోట్లాది మంది భక్తులు తరించిపోయారు. అమ్మలకు నిలువెత్తు బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గద్దెలపై కొలువై మూడు రోజులపాటు పూజలందుకున్న సమక్క తల్లి భక్తుల జయజయధ్వానాల మధ్య వన ప్రవేశం చేశారు. సంగీత వాయిద్యాల చప్పుళ్లు, కొమ్ముబూరల శబ్ధాలతో ఆదివాసీ సాంప్రదాయాల మధ్య మళ్లీ వస్తానంటూ అమ్మవారు జనం నుంచి వనంలోకి వెళ్లారు. అమ్మతోపాటు మిగతా గద్దెలపై పూజలందుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను సైత గొట్ల పూజారులు తమ ప్రాంతాల్లోని ఆలయాలకు తీసుకెళ్లారు. దీంతో రెండేండ్లకోసారి జరిగి ఈ ఆధ్యాత్మిక వేడుక ముగిసింది. ఫిబ్రవరి 4న బుధవారం తిరుగువారం పండుగతో మేడారం జాతర పరిసమాప్తం కానుంది.
గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మ వన ప్రవేశాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సమ్మక్క గద్దెపై భక్తులు సమర్పించిన చీరసారె, బంగారం, పసుపు కుంకుమను మేడారం ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు, గిరిజనేతర భక్తులు తీసుకున్నారు. ప్రసాదాన్ని (బెల్లం) తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. దర్శనాల ప్రక్రియను పూర్తిగా నిలిపివేసిన తర్వాత దేవతల వనప్రవేశ ఘట్టం మొదలైంది. మహా జాతర సందర్భంగా 1.50 కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
తగ్గని రద్దీ..
శనివారం ఉదయం భక్తుల రద్దీ కొద్దిగా తక్కువగానే ఉంది. అయితే శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు మేడారం-తాడ్డాయి, మేడారం-గోవిందరావుపేట వయ నార్లాపూర్ రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో సుమారు 14 గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో శనివారం మధ్యాహ్నం తర్వాత మళ్లీ క్యూలైన్లు జనంతో నిండిపోయాయి. దేవతల వనప్రవేశం తర్వాత కూడా మొక్కుల చెల్లింపులు కొనసాగాయి. జాతరకు వచ్చే ట్రాఫిక్ నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. రోడ్ల విస్తరణ చేపట్టామని, ఏఐను వినియోగించి యాప్ ద్వారా ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెడతామని అధికారులు చెప్పినా వాహనదారులకు ఎప్పటిలాగే ఈసారీ సమస్యలు తప్పలేదు.
గద్దెల వద్ద రద్దీ నియంత్రణలోనూ అధికారులు విఫలమయ్యారు. మేడారంలోని గద్దెల ప్రాంగణం, క్యూలైన్లను విస్తరించామని, ఒకేసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని గొప్పలు పోయారు. ఈసారి తోపులాటలు ఉండబోవని చెప్పారు. అయితే, వారి మాటలకు వాస్తవ పరిస్థితులకు అసలు పొంతనే లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి సిబ్బంది వీఐపీల సేవల పునీతులవడంతో గద్దెల వద్ద సామాన్య భక్తుల తోపులాటలు షరామామూలే అన్నట్లు అయింది.
సంబంధిత వార్తలు

CID Notice to Koushik Reddy | పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశం
మార్చి 31, 2026

Medaram | మేడారం గద్దెల వద్ద జారిపడిన రాతిశిల.. బాలుడికి తీవ్ర గాయాలు
మార్చి 26, 2026

Home Guard | మేడారం జాతరలో పరిచయం.. ముగ్గురు పిల్లలున్న హోంగార్డును పెండ్లి చేసుకున్న యువతి
మార్చి 7, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



