Harish Rao Siddipet Speech | ఆరు గ్యారంటీలతో మోసం.. అసెంబ్లీలో గల్లా పట్టుకుని అడుగుతా
సిద్దిపేట వేదికగా సీఎం రేవంత్‌పై హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జీవో 97, వెటర్నరీ కాలేజీ తరలింపుపై అసెంబ్లీలో గల్లా పట్టుకుని అడుగుతానని హెచ్చరించారు.
- ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరించే జీవో 97ను రద్దు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
- రూ.200 కోట్లతో మంజూరైన వెటర్నరీ కాలేజీని దొంగలా రాత్రికి రాత్రే కొడంగల్‌కు తరలించారని ఫైర్
- 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి కేవలం 16 వేలు మాత్రమే భర్తీ చేశారని, హామీలు అమలు చేయని సీఎం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్
- విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్న వారిపై కేసులు పెడితే ఊరుకోనని, ముఖాముఖిగా తనను దాటి విద్యార్థులపై చెయ్యి వేయాలని పోలీసులకు సవాల్
- సీఎం రేవంత్‌పై హరీశ్ రావు సమరభేరి
Harish Rao Siddipet Speech | త్రినేత్ర.న్యూస్ : ఆరు గ్యారంటీల (Six Guarantees) పేరుతో ప్రజలను నిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీస్తానని ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏదీ? ఎస్సీ, ఎస్టీల జీవితాలతో చెలగాటమా?
కేసీఆర్ హయాంలో కరోనా కష్టకాలం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి ఏటా రూ.2,000 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) కింద చెల్లించామని హరీశ్ రావు గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ పెట్టిన బకాయిలను సైతం క్లియర్ చేసి, తొమ్మిదేళ్లలో దాదాపు రూ.20,000 కోట్లు చెల్లించి ఎంతో మందిని ఇంజనీర్లు, డాక్టర్లుగా తీర్చిదిద్దామన్నారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల చదువులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గజ్వేల్‌లోని శ్రీ కృప ఫార్మసీ (Pharmacy) కాలేజీ విద్యార్థులు ఫీజు బకాయిల వల్ల సర్టిఫికెట్లు రాక ఎం.ఫార్మసీలో జాయిన్ కాలేకపోతున్నారని, లాస్ట్ డేట్ దగ్గరపడుతుండటంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్లే తాము లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని, సర్టిఫికెట్లు ఇవ్వలేమని యాజమాన్యాలు చెబుతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి తీరు వల్ల రాష్ట్రంలో 300 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయని, ఒక్క సిద్దిపేటలోనే 5 కాలేజీలు క్లోజ్ అయ్యాయని విమర్శించారు.
జీవో 97తో పాలిటెక్నిక్ ప్రైవేటీకరణ.. స్కూల్స్ లో కనీసం బట్టలివ్వని దౌర్భాగ్యం
పాలిటెక్నిక్ (Polytechnic) కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో కలుపుతూ ప్రభుత్వం తెచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో రూ.5,000 ఫీజుతో మూడేళ్ల కోర్సు పూర్తవుతుంటే.. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP Model) పేరిట స్కిల్ యూనివర్సిటీకి మార్చి, ఆరు నెలలకు రూ.50 వేలు, ఏడాదికి రూ.80 వేల ఫీజు వసూలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. విద్యార్థులు ఇంజనీర్లు కావాలని కలలు కంటుంటే, వారిని మెకానిక్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ లాంటి బ్లూ కాలర్ జాబ్స్ (Blue collar jobs) వైపు నెట్టడం దారుణమన్నారు. "విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. స్కూల్స్ ప్రారంభమై మూడు నెలలైనా కనీసం బట్టలు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం ఇది" అని ఎద్దేవా చేశారు.

సిద్దిపేట వెటర్నరీ కాలేజీని దొంగిలించారు
సిద్దిపేట విద్యార్థుల కోసం బీబీఎస్, నర్సింగ్, డిగ్రీ, అగ్రికల్చర్, ఐటీఐ కాలేజీలను తాను అందుబాటులోకి తెచ్చానని.. కలెక్టరేట్ వద్ద రూ.200 కోట్లతో వెటర్నరీ కాలేజీ (Veterinary College) మంజూరు చేయిస్తే, సీఎం రేవంత్ రెడ్డి దొంగలా రాత్రికి రాత్రే దాన్ని కొడంగల్‌కు ఎత్తుకుపోయారని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శిల్పారామం, రంగనాయక సాగర్ టూరిజం అభివృద్ధి పనులను సైతం ఉద్దేశపూర్వకంగా ఆపేశారని మండిపడ్డారు.

జాబ్ క్యాలెండర్ కాదు.. అది జాబ్‌లెస్ క్యాలెండర్
మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్‌లో కనీసం ఉద్యోగాల సంఖ్య కూడా వేయలేదని విమర్శించారు. దాన్ని జాబ్ క్యాలెండర్ అనలేమని, 'జాబ్‌లెస్ క్యాలెండర్' అనాలని సెటైర్ వేశారు. కాంగ్రెస్ ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 16 వేల ఉద్యోగాలేనని స్వయంగా అసెంబ్లీలో ఒప్పుకున్నారని, కానీ బీఆర్ఎస్ 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని స్పష్టం చేశారు. "నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు" అన్న చందంగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారని, ఉద్యోగాలు అడగాల్సింది పోయి కేసీఆర్ రాజీనామా చేయాలంటూ ర్యాలీలు చేయడం హాస్యాస్పదమన్నారు.

పోలీసులకు వార్నింగ్.. కొట్టాలంటే నన్ను కొట్టండి
విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న వారిపై కేసులు పెడతామని పోలీసులు బెదిరింపులకు పాల్పడటం మానుకోవాలని హరీశ్ రావు హెచ్చరించారు. విద్యార్థుల మీద కేసులు పెట్టాలన్నా, వారిని కొట్టాలన్నా.. ముందు తనను దాటి వెళ్లాలని, దమ్ముంటే తనపై కేసులు పెట్టాలని సవాల్ విసిరారు.

ఆడపిల్లలకు స్కూటీలు, పెళ్లికి తులం బంగారం, రూ.4,000 పెన్షన్, రూ.2,500 మహిళా సాయం.. ఇలా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్ కిట్, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలను ఆగం చేశారని ఫైర్ అయ్యారు. 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో యువత, విద్యార్థుల పక్షాన పోరాడుతానని, కాంగ్రెస్ నేతల గల్లా పట్టుకుని సమస్యలు తేలుస్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు
సెప్టెంబర్ 4, 2026

Harish Rao | వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి మటుమాయమైంది.. వెయ్యి పడగలతో అవినీతి రాజ్యమేలుతోంది
సెప్టెంబర్ 4, 2026

Harish Rao | తాగునీరు లేక విద్యార్థుల అవస్థలు.. కాగజ్‌నగర్ ఎస్టీ బాయ్స్ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన హరీశ్ రావు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ
- ●CEO Sudarshan Reddy | సర్ గడువు పొడిగించండి.. ఈసీఐకి సీఈవో లేఖ
- ●Sumitra Anand | ఎన్ని కథలు చెప్పినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే
- ●P Muralidhar Rao vs Konda Surekha | "బీజేపీ ఏమైనా చెత్తకుప్పా?".. కొండా సురేఖ చేరిక వార్తలపై మురళీధర్ రావు సంచలన ట్వీట్
- ●MLA Padi Kaushik Reddy | ఆరు వారాలు గడువు ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యర్థన
- ●Data Center | హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్

Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ

CEO Sudarshan Reddy | సర్ గడువు పొడిగించండి.. ఈసీఐకి సీఈవో లేఖ

Sumitra Anand | ఎన్ని కథలు చెప్పినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే

P Muralidhar Rao vs Konda Surekha | "బీజేపీ ఏమైనా చెత్తకుప్పా?".. కొండా సురేఖ చేరిక వార్తలపై మురళీధర్ రావు సంచలన ట్వీట్



