త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రాష్ట్రంలో నూత‌న ఈవీ పాల‌సీ ద్వారా కాలుష్యం త‌గ్గించేందుకు చ‌ర్య‌లు: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | రాష్ట్రంలో నూత‌న విద్యుత్ వాహ‌నాల పాల‌సీ (EV Policy) ద్వారా కాలుష్యాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) తెలిపారు. నూత‌న ఈవీ పాల‌సీ, ఆర్టీసీ (RTC) కి సంబంధించిన వివిధ అంశాల‌పై స‌భ్యులు శాస‌న‌స‌భ‌ (Assembly)లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.

A

Telangana | Published On Jan 6, 2026, 3.26 pm IST

Ponnam Prabhakar | రాష్ట్రంలో నూత‌న ఈవీ పాల‌సీ ద్వారా కాలుష్యం త‌గ్గించేందుకు చ‌ర్య‌లు: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | రాష్ట్రంలో నూత‌న విద్యుత్ వాహ‌నాల పాల‌సీ (EV Policy) ద్వారా కాలుష్యాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) తెలిపారు. రాబోయే త‌రానికి మంచి జీవితం ఉండేందుకు జీవో 41 ద్వారా నూత‌న ఈవీ పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టామ‌ని చెప్పారు. నూత‌న ఈవీ పాల‌సీ, ఆర్టీసీ (RTC) కి సంబంధించిన వివిధ అంశాల‌పై ప‌లువురు స‌భ్యులు శాస‌న‌స‌భ‌ (Assembly)లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు పొన్నం స‌మాధానం ఇచ్చారు. సంవ‌త్స‌ర కాలంలో రాష్ట్రంలో ల‌క్ష ఈవీ వాహ‌నాల విక్ర‌యాలు జ‌రిగాయ‌న్నారు. ఈవీ పాల‌సీకి ప్రోత్సాహం అందించేందుకు ప్ర‌భుత్వం రూ.900 కోట్ల నిధుల‌తో ప్ర‌త్యేక విధానాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. దీనితో ప్ర‌భుత్వంపై అద‌న‌పు భారం ప‌డినా కూడా వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌ని పేర్కొన్నారు.

గ‌తంలో 0.3 శాతంగా ఉన్న ఈవీ వాహ‌నాలు రెండు శాతానికి పెరిగాయ‌న్నారు. ఇటీవ‌ల ఎల‌క్ట్రిక్ వాహ‌నాల డీల‌ర్ల‌తో ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు విద్యుత్ వాహ‌నాలు కొంటే ధ‌ర‌లో ఇర‌వై శాతం మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరామ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు, పాఠశాల బస్సులు, ఫార్మా, ఐటీ వాహనాలలో వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా 25 నుంచి 50 శాతం వ‌ర‌కు ఈవీ వాహ‌నాలు కొనేలా విధానాన్ని తీసుకురాబోతున్నామ‌ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వేల‌కుపైగా బ‌స్సులు ఉన్నాయ‌ని చెప్పారు. పీఎం ఈ డ్రైవ్ కింద రాష్ట్రంలో 500 బ‌స్సులు తిరుగుతున్నాయ‌ని, ఈ ప‌థ‌కం కింద న‌గ‌రానికి త్వ‌ర‌లో 2800 బ‌స్సులు ద‌శ‌ల వారీగా రానున్నాయ‌ని వివ‌రించారు. వరంగల్ కార్పొరేష‌న్‌కు 100, నిజామాబాద్ కార్పొరేష‌న్‌కు 50 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని తెలిపారు. మనం వాడే వాహనాలు కూడా ఈవీ వాహనాలు ఉండేలా చూసుకోవాల‌ని సూచించారు. జీవో నెంబర్ 41 ను ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నారన్న ఆయ‌న‌.. పాల‌సీ రాక ముందు, ఇప్ప‌టికి చాలా మార్పులు జ‌రిగాయ‌ని అన్నారు.

అందుబాటులోకి నూత‌న స్క్రాప్ పాల‌సీ..

ప‌దిహేనేళ్ల పైబడిన వాహనాల కోసం స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామ‌ని చెప్పారు. గతంలో స్క్రాప్ పాలసీ లేదని గుర్తు చేశారు. గ్రీన్ టాక్స్‌ను రూ.30 వేలకు పెంచిన‌ట్లు తెలిపారు. ప‌దిహేనేళ్ల పైబ‌డిన వాహ‌నాల‌ను త‌ప్ప‌నిస‌రిగా స్క్రాప్‌కు పంపించాల‌ని, అలా పంపించిన వారికి ప్రోత్సాహ‌కాలు అందిస్తున్నామ‌ని వివ‌రించారు. ఆర్టీసీలో డీజిల్ బ‌స్సులను రెటిరోఫిట్ చేసి ఎల‌క్ట్రిక్ బ‌స్సులుగా మారుస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఆటోలు కూడా డీజిల్ వాహ‌నాలు క‌నిపించ‌కుండా రెటిరోఫిట్‌కు అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. న‌గ‌రంలో సీఎన్‌జీ, ఎల్‌పీజీ, ఈవీ ఆటోలు, రెటిరోఫిట్ ఆటోల‌కు అనుమ‌తించిన‌ట్లు చెప్పారు.

ఎక్క‌డికక్క‌డ చార్జింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు..

చార్జింగ్ స్టేష‌న్ల‌ను పెంచేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. రెడ్కో సంస్థ ద్వారా చార్జింగ్ స్టేష‌న్‌లు ఏర్పాటు చేస్తున్న‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, గ్రేట‌ర్ క‌మ్యూనిటీ హాల్‌లు, విద్యాల‌యాల వ‌ద్ద చార్జింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌న్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో రెడ్కో ద్వారా చార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నామ‌ని అన్నారు. అన్ని కలెక్టరేట్లు, రెస్టారెంట్‌లు, టూరిజం స్పాట్ల‌లో చార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. ఇది ప్రభుత్వం మాత్రమే కాదు ప్రజల సహకారంతో చేయాలని, ప్రజలకు సౌకర్యం ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు.

హైద‌రాబాద్‌ను కాలుష్య ర‌హితంగా మార్చ‌డ‌మే ల‌క్ష్యం..

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే అక్కడ గాలిలో డేంజరస్ బ్యాక్టీరియా ఉన్నట్లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయ‌ని పొన్నం చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంట్ వ్యవస్థ ఉన్న న‌గ‌రాన్ని కూడా కాలుష్యం నుంచి కాపాడుకోలేక‌పోతున్నామ‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. మ‌న హైద‌రాబాద్‌లో అలాంటి ప‌రిస్థితి రాకుండా ఉండేందుకు నూత‌న ఈవీ పాల‌సీ ద్వారా ఈవీ వాహ‌నాల‌తో పాటు సీఎన్‌జీ, ఎల్‌పీజీ వాహ‌నాల వినియోగాన్ని పెంచుతున్నామ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 దాటుతోంద‌ని, ఢిల్లీలో 400 దాటింద‌ని చెప్పారు. న‌గ‌రంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగుండేలా చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. కాలుష్య నివారణకు ప్లాంటేషన్ పెంచడంతో పాటు ఈవీ వాహనాల వినియోగం పెంచాలని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈవీ వాహనాల వినియోగంలో దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే తరానికి కాలుష్యరహిత తెలంగాణ అందించాలని పిలుపునిచ్చారు.

ఆర్టీసీ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్రాధాన్యం..

ఆర్టీసీలో ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణలు ప్రాధాన్యతగా ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని పొన్నం చెప్పారు. ఇప్ప‌టికే ఆర్టీసీలో అనేక పెండింగ్ సమస్యలు పరిష్కరించామ‌ని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన విలీన అంశానికి సంబంధించి ఒకటి.. కార్మిక సంఘాల రద్దు పాలసీ అంశాన్ని మార్చ‌డం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర పెండింగ్‌లో ఉంద‌ని, దీనిపై త్వ‌ర‌లోనే మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌వుతాయ‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణంలో ఆర్టీసీ కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని ప్ర‌శంసించారు. దాదాపు ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణికులు, 35 లక్షల కిలోమీటర్ల తిరుగుతూ 342 బస్ స్టేషన్లు కనెక్టివిటీ చేస్తూ 12 వేల గ్రామాలు కనెక్ట్ చేస్తూ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. డ్రైవర్లు, కండక్టర్‌ల సంక్షేమం ప్ర‌భుత్వ బాధ్య‌త అని పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భ‌ద్ర‌తా మాసోత్స‌వంలో భాగంగా గ‌త 30 ఏళ్లుగా ఒక్క ప్ర‌మాదం కూడా చేయ‌ని డ్రైవ‌ర్ల‌ను స‌త్క‌రించుకున్నామ‌ని వివ‌రించారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎవ‌రైనా మృతి చెందితే రూ.కోటి న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చేందుకు యూనియ‌న్ బ్యాంక్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌న్నారు. ప‌దేళ్ల క్రితం నుంచి ఆర్టీసీలో స‌ర్వీస్ రిమూవ‌ల్ అయిన వారు ప్రజావాణిలో ద‌ర‌ఖాస్తు చేసుకుంటే త్రీమెన్ క‌మిటీ వేసి వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నామ‌ని చెప్పారు. కారుణ్య నియామ‌కాలు సైతం చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement