త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gutha Sukhender Reddy | తెలంగాణ విద్యాశాఖ ప‌నితీరుపై మండ‌లి చైర్మ‌న్ ఆగ్ర‌హం

Gutha Sukhender Reddy | తెలంగాణ విద్యాశాఖ పనితీరుపై శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌న ఊరు - మ‌న బ‌డి ప‌థ‌కానికి రూ. 360 కోట్ల బ‌కాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.. వాటిని త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కోరారు.

S

Telangana | Published On Jan 6, 2026, 2.29 pm IST

Gutha Sukhender Reddy | తెలంగాణ విద్యాశాఖ ప‌నితీరుపై మండ‌లి చైర్మ‌న్ ఆగ్ర‌హం
Advertisement

Gutha Sukhender Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ విద్యాశాఖ పనితీరుపై శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌న ఊరు - మ‌న బ‌డి ప‌థ‌కానికి రూ. 360 కోట్ల బ‌కాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.. వాటిని త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కోరారు. శాస‌న‌మండ‌లి స‌మావేశాల్లో విద్యాశాఖ‌పై చ‌ర్చ సంద‌ర్భంగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

మా గ్రామంలోని పాఠ‌శాల గురించి ఒక ఏడాది నుంచి చెబుతూనే ఉన్నా.. స‌రైన వ‌స‌తులు లేక పిల్లలు రోజు చెట్ల కింద కూర్చుంటున్నారు. దీని గురించి సీఎంకు, డిప్యూటీ సీఎంకు చెప్పాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల తెచ్చి.. దాన్ని మీరు మైనింగ్ సెస్‌కు అటాచ్ చేశారు. మైనింగ్ సెస్ వచ్చే దగ్గర నిధులు విడుదల చేస్తున్నారు.. కొన్ని చోట్ల అవి కూడా నిధులు ఆగిపోయాయని మండ‌లి చైర్మ‌న్ తెలిపారు.

ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ ఎక్కువ అయ్యాయి. ఈ సంవత్సరం 3 లక్షల మందిని చేర్చుకున్నామని చెబుతున్నారు కానీ 30 వేల మందిని కూడా చేర్చుకోలేది.. లెక్కలు మాత్రమే చూపిస్తున్నారు. దయచేసి మన ఊరు మనబడి బ‌కాయిలు చెల్లించండి.. చిన్న చిన్న కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి పనులు చేశార‌ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

https://twitter.com/TeluguScribe/status/2008411762375430451

Advertisement

తాజావార్తలు

Advertisement