Maoists | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన అగ్రనేతలు
Maoists | వరుస ఎన్‌కౌంటర్లు, క్యాటర్, లీడర్ల లొంగుబాట్లు, భద్రతా దళాల ఉక్కుపాదంతో కోలుకోలేని స్థితిలో ఉన్న మావోయిస్టు పార్టీకి (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు టాప్ కమాండర్ దేవ్ జీ (Devji) అలియాస్ తిప్పిరి తిరుపతి (Tippiri Tirupati), కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Maoists | త్రినేత్ర.న్యూస్: వరుస ఎన్‌కౌంటర్లు, క్యాటర్, లీడర్ల లొంగుబాట్లు, భద్రతా దళాల ఉక్కుపాదంతో కోలుకోలేని స్థితిలో ఉన్న మావోయిస్టు పార్టీకి (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు టాప్ కమాండర్ దేవ్ జీ (Devji) అలియాస్ తిప్పిరి తిరుపతి (Tippiri Tirupati), కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారితో సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్ఐబీకి సరెండర్ అయ్యారు. ఈ కీలక నేతలే టార్గెట్‌గా కేంద్ర బలగాలు ఇటీవల తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్-2 మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు కుమ్రం భీం ఆసిఫాబాద్ అడవుల్లో లొంగిపోయినట్లు తెలుస్తున్నది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
1983లో అజ్ఞాతంలోకి..
తిప్పిరి తిరుపతి స్వస్థలం జగిత్యాల జిల్లాలోని కోరుట్ల. అతని తండ్రి పేరు వెంకట్ నర్సయ్య. 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన తిరుపతి.. క్రమంగా ఉన్నత స్థానానికి ఎదిగి దక్షిణ భారత జోన్ ఆపరేటర్‌గా పనిచేశారు. ఆయన పేరు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది, పార్టీ లోపల అతన్ని సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్న అని పిలుస్తారు.
2010 ఏప్రిల్‌లో దంతెవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో 74 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి తిరుపతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. నంబల కేశవరావు మరణం తరువాత , తిరుపతి సెప్టెంబర్ 2025లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
సంబంధిత వార్తలు

Amit Shah Felicitates Telangana Police | తెలంగాణ పోలీసులకు అరుదైన గౌరవం: ‘నక్సల్స్ ఫ్రీ’ ఆపరేషన్‌పై అమిత్ షా ప్రశంసల జల్లు
మే 18, 2026

Special Police Officers | క్లూస్ టీమ్‌లో స్పెషల్ పోలీసు ఆఫీసర్స్ నియామకం.. ఎల్లుండే చివరి తేదీ..!
మే 18, 2026

Governor | జైళ్లలో సంస్కరణలు భేష్.. ‘ఫీల్ ది జైల్’ ప్రారంభోత్సవంలో గవర్నర్ శుక్లా
మే 12, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



