త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP | మ‌క్త‌ల్‌లో బీజేపీ అభ్య‌ర్థి ఆత్మ‌హ‌త్య‌.. మంత్రి వాకిటి శ్రీహ‌రి బెదిరింపులే కార‌ణ‌మా..?

BJP | ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని మ‌క్త‌ల్ మున్సిపాలిటీ ప‌రిధిలో విషాదం నెల‌కొంది. 6వ వార్డుకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్య‌ర్థి, గిరిజ‌న బిడ్డ ఎరుక‌ల మ‌హాదేవ‌ప్ప ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

S

Telangana | Published On Feb 10, 2026, 11.37 am IST

BJP | మ‌క్త‌ల్‌లో బీజేపీ అభ్య‌ర్థి ఆత్మ‌హ‌త్య‌.. మంత్రి వాకిటి శ్రీహ‌రి బెదిరింపులే కార‌ణ‌మా..?
Advertisement

BJP | త్రినేత్ర‌.న్యూస్ : ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని మ‌క్త‌ల్ మున్సిపాలిటీ ప‌రిధిలో విషాదం నెల‌కొంది. 6వ వార్డుకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్య‌ర్థి, గిరిజ‌న బిడ్డ ఎరుక‌ల మ‌హాదేవ‌ప్ప(48) ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. స్థానిక మంత్రి వాకిటి శ్రీహ‌రి బెదిరింపుల‌ను భ‌రించ‌లేక‌, వేధింపుల‌ను త‌ట్టుకోలేక మ‌హాదేవ‌ప్ప ఉరేసుకున్నాడ‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ 4 గంటలకు ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడ‌ని తెలిపారు. అయితే త‌న భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు మంత్రి వాకిటి శ్రీహ‌రినే కార‌ణ‌మ‌ని భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

బ‌ల‌వంతంగా కాంగ్రెస్ కండువా క‌ప్పి..

కొంతకాలం క్రితం మ‌హాదేవ‌ప్ప‌కు మంత్రి శ్రీహ‌రి బ‌ల‌వంతంగా కాంగ్రెస్ కండువా క‌ప్పారు. కానీ రెండు రోజుల‌కే మ‌హాదేవ‌ప్ప తిరిగి బీజేపీలో చేరారు. మున్సిపాలిటీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌క్త‌ల్ మున్సిపాలిటీ 6వ వార్డుకు పోటీ చేశారు. ఇక అప్ప‌ట్నుంచి అత‌న్ని కాంగ్రెస్ నేత‌లు వేధింపుల‌కు గురి చేస్తూనే ఉన్నార‌ని తెలిసింది. మక్తల్ పట్టణంలో నిన్న నిర్వ‌హించిన బీజేపీ ర్యాలీ విజ‌య‌వంతం కావ‌డంతో. రాత్రికి బీజేపీ అభ్య‌ర్థుల‌కు ఫోన్లు చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని, దాంతోనే మ‌హాదేవ‌ప్ప ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బీజేపీ నేత‌లు పేర్కొంటున్నారు.

మ‌హాదేవ‌ప్ప ఆత్మ‌హ‌త్య తీవ్రంగా క‌లిచివేసింది : ఎన్ రామ‌చంద‌ర్ రావు

మ‌క్త‌ల్ మున్సిపాలిటీలో 6వ వార్డు అభ్య‌ర్థి ఎరుక‌ల మ‌హాదేవ‌ప్ప ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌ని బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మహదేవప్ప మరణం వెనుక కాంగ్రెస్ పార్టీ అహంకార రాజకీయాలు, మాఫియా బెదిరింపులే కారణమని తెలుస్తోంది. స్థానిక మంత్రి శ్రీహరి, వారి అనుచరుల వేధింపులు తట్టుకోలేకే మహాదేవప్ప ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని బలమైన ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మక్తల్‌లో బీజేపీ ర్యాలీ విజయవంతం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక, బీజేపీ అభ్యర్థులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మాఫియా రాజకీయాలు, అహంకార ధోరణి తట్టుకోలేకే మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే ప్రత్యర్థులను బెదిరించి, ఒత్తిళ్లకు గురిచేసి, చివరకు ఒక కార్యకర్త ప్రాణం కోల్పోయే పరిస్థితి తెచ్చే రాజకీయాలు కాంగ్రెస్‌కే పరిమితం. అధికార మత్తులో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోంది. ఒక అహంకార రాజకీయ నాయకుడి వేధింపులకు ఒక నిండు ప్రాణం బలైంది. ఈ ఘటనకు కారణమైన మంత్రి శ్రీహరిని తక్షణమే అరెస్ట్ చేసి, కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో బీజేపీ కార్యకర్తల ఆగ్రహజ్వాలకు గురికాక తప్పదని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. దోషులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టకూడదు. మహాదేవప్ప కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుంది అని రామ‌చంద‌ర్ రావు స్ప‌ష్టం చేశారు.

మ‌హ‌దేవ‌ప్ప‌ది ఆత్మ‌హ‌త్య కాదు.. కాంగ్రెస్ హ‌త్య‌నే : బండి సంజ‌య్

మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్‌ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోంది. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తారా? ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీపై యుద్దం చేయబోతున్నాం. బీఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్తాపితం చేసే రోజులొచ్చాయి. బీజేపీ కార్యకర్తలారా.. ధైర్యంగా ఉండండి. బీజేపీ నాయకత్వం మీకు అండగా ఉంది. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలి. నిష్పాక్షికంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షాంచాలి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement