Bhatti Vikramarka | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ (Congress) పార్టీని గెలిపించాలని ఉపముఖ్యమంత్రి (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Bhatti Vikramarka | రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ (Congress) పార్టీని గెలిపించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రజలకు పిలుపునిచ్చారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మధిరలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విక్రమార్క మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. అర్హత కలిగిన పేదలందరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, దాని ద్వారా మూడు లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నారని వివరించారు. అల్పాదాయ వర్గాలకు విద్యుత్ 200 యూనిట్లకు తక్కువ వినియోగిస్తే ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.
విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కోసం ఏటీసీలను ఏర్పాటు చేశామని, వీటిద్వారా భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నా ఆయన.. మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు రూ.ఆరువేల కోట్లు ఇచ్చామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి కలుపుతూ.. పరిశ్రమలు, మౌళిక వసతులు, విద్య, వైద్యంపై దృష్టిసారించి ముందుకు పోతున్నామని వివరించారు. రాష్ట్రాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసేందుకు కోర్, ప్యూర్, రేర్ మూడు దశలుగా విభజించామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో అవసరానికి తగ్గ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
విజన్ 2047 డాక్యుమెంట్‌ను విడుదల చేశామని, ఆ డాక్యుమెంట్‌లోని అభివృద్ధిని సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ముందుకు పోతున్నామన్నారు. వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్లాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులను సమన్వయం చేసుకుని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



