Mahesh Kumar Goud | డ్రగ్ టెస్టులకు కేటీఆర్ సిద్ధం కావాలి : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇందులో పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మొత్తం 11 మంది పోలీసులకు చిక్కడం సంచలనం సృష్టించింది. డ్రగ్స్ పార్టీపై పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ కేసుపై కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈగల్ టీమ్ తన కర్తవ్యాన్ని నెరవేర్చిందన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, రాజకీయాలకు అతీతంగా పని చేస్తోందన్నారు.
ప్రజలు, డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈగల్ టీమ్ దాడులు జరుపుతోందన్నారు. కేటీఆర్‌తో పాటు ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా అనుమానాలు ఉన్నాయన్నారు. అవసరమైతే కేటీఆర్ సైతం డ్రగ్స్ టెస్టులకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా డ్రగ్స్ టెస్టులు చేసుకొని లోపలికి వెళ్దామన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్న ఆయన.. ఆ ప్రయత్నానికి మనవతు సాయం చేయాలని పిలుపునిచ్చారు. పోరాటాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అయితే, గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు నిరసన చేపట్టి.. నో డ్రగ్స్.. సేవ్ తెలంగాణ అంటూ నినదించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



