త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Aruna | ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే.. ఎంపీ డీకే అరుణ డిమాండ్

DK Aruna | అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయం అని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ మండిప‌డ్డారు.

S

Telangana | Published On Sep 8, 2026, 7.24 pm IST

DK Aruna | ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే.. ఎంపీ డీకే అరుణ డిమాండ్
Advertisement

DK Aruna | త్రినేత్ర‌.న్యూస్ : అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయం అని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ మండిప‌డ్డారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు ఇంత అనుచితంగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించదగినది. బాధ్యులైన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆమె వీడియో సందేశం విడుద‌ల చేశారు.

ఆమె మాటల్లోనే

నిన్న అసెంబ్లీ గేటు వ‌ద్ద మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు స‌బితా ఇంద్రారెడ్డి, సునీతా ల‌క్ష్మారెడ్డిపై పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరు చాలా హేయ‌మైన‌ది. మ‌హిళా ఎమ్మెల్యేల ప‌ట్ల అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో పోలీసులు అంత అనుచితంగా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాదు. ఎవ‌రి ఆదేశాల మేర‌కు పోలీసులు అలా ప్ర‌వ‌ర్తించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కా..? ఈ చ‌ర్య‌ల‌పై హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కొంచెమ‌న్న సిగ్గు అనిపిస్త‌లేదా..? స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప‌ట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్య‌ల‌కు ఏ విధంగా క్ష‌మాప‌ణ కోరుతున్నారో, వారి మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చ‌ర్చ చేయ‌డం జ‌రిగింది. మ‌రి మ‌హిళా ఎమ్మెల్యేల ప‌ట్ల పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఎందుకు చర్చ చేయ‌డం లేదు. మ‌హిళా ఎమ్మెల్యేల మెడ‌బ‌ట్టి, జుట్టు లాగి, చీర ప‌ట్టుకుని లాగితే కూడా దానిపై నోరు విప్ప‌రు. ఇంత‌కంటే దారుణ‌మైన‌ది ఇంకోటి ఉన్న‌దా..? ఆ పోలీసుల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాలి. మ‌హిళా ఎమ్మెల్యేల‌కే ఈ ప‌రిస్థితి ఎదురైతే.. సామాన్యులకు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే వారి ప‌రిస్థితి ఏంటో ఊహించుకోవాలంటేనే భ‌యంగా ఉంది అని పేర్కొన్నారు.

ఉమ్మ‌డి ఏపీలో స‌బితా ఇంద్రారెడ్డి హోం మంత్రిగా, సునీతా ల‌క్ష్మారెడ్డి కూడా మంత్రిగా ప‌ని చేశారు. ఇవాళ పార్టీలో వేరు ఉండొచ్చు.. కానీ సాటి ఎమ్మెల్యేల‌పై జ‌రిగిన దాడిని ముఖ్య‌మంత్రి ఖండించి ఉండాల్సింది. ఒక‌రికి ఒక న్యాయం, ఇంకొక‌రికి ఇంకో న్యాయం అనేది క‌రెక్ట్ కాదు. మ‌హిళల ప‌ట్ల నీకు ఇంకా గౌర‌వం ఉండాలి. ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉన్న ఎమ్మెల్యేల‌కే గౌర‌వం లేక‌పోతే, సామాన్య మ‌హిళ‌ల ప‌రిస్థితి ఏంటి..? ఈ చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాలి. అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాన‌ని డీకే అరుణ పేర్కొన్నారు.

Advertisement
Advertisement