త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Goud | నేను ఎమ్మెల్యే శంక‌ర్ వ్యాఖ్య‌లు విన‌లే

Maheshkumar Goud | కేసీఆర్‌పై ఎమ్మెల్యే శంక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు తాను విన‌లేద‌ని.. ఎమ్మెల్సీ తాత మ‌ధు వ్యాఖ్య‌లను కేసీఆర్ (KCR) ఇప్ప‌టివ‌ర‌కు కూడా ఖండించ‌లేద‌ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. స్ట్రాటజీ ఫ్రెమ్ చేసి తాత మధును పంపారని ఆరోపించారు.

S

Telangana | Published On Sep 8, 2026, 6.35 pm IST

Maheshkumar Goud | నేను ఎమ్మెల్యే శంక‌ర్ వ్యాఖ్య‌లు విన‌లే
Advertisement
  • తాత మ‌ధు వ్యాఖ్య‌ల‌ను కేసీఆర్ ఇప్ప‌టికీ ఖండిచ‌లేదు
  • కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డికే సామాజిక స్పృహ ఎక్కువ
  • రెండు రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఫైన‌ల్ చేస్తాం
  • మీడియా చిట్‌చాట్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

Maheshkumar Goud | త్రినేత్ర‌.న్యూస్: కేసీఆర్‌పై ఎమ్మెల్యే శంక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు తాను విన‌లేద‌ని.. ఎమ్మెల్సీ తాత మ‌ధు వ్యాఖ్య‌లను కేసీఆర్ (KCR) ఇప్ప‌టివ‌ర‌కు కూడా ఖండించ‌లేద‌ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. స్ట్రాటజీ ఫ్రెమ్ చేసి తాత మధును పంపారని ఆరోపించారు. టీషర్ట్స్‌పై అభ్యంకతకర వ్యాఖ్యలున్నాయనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను అడ్డుకున్నారన్నారు. మ‌రో రెండు రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ఫైన‌ల్ చేస్తామ‌ని చెప్పారు. సీఎల్పీ కార్యాల‌యంలో మీడియాతో చిట్‌చాట్ సంద‌ర్భంగా పై వ్యాఖ్య‌లు చేశారు.

దళితులకు కాంగ్రెస్ లో అత్యున్నత పదవులు ఇచ్చాం. ప్రతిపక్ష నేత హోదా పదవి నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి భట్టి విక్రమార్కను తొలగించారు. అర్ధరాత్రి రాజయ్యను బర్తరఫ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిండు. తాతా మధు మాట్లాడింది బీఆర్ఎస్‌ స్క్రిప్ట్. స్ట్రాటజీ ఫ్రెమ్ చేసి తాత‌ మధును పంపారు. కేసీఆర్ 10 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉండి దళిత స్పీకర్‌ను అవమానిస్తే ఖండించలేదు. మహిళ లేకుండానే కేసీఆర్‌ క్యాబినెట్ నడిపిండు.

పదేళ్లలో కేసీఆర్ అంబేద్కర్‌కు దండ వేయలేదు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డికి సామాజిక స్పృహ ఎక్కువ. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అధ్యక్షా అని పిలవాల్సి వస్తుంది అని కేసీఆర్ అసెంబ్లీ రాలేదు. ఏ రాష్ట్రంలో అపోజిషన్ లీడర్ పామ్‌హౌస్‌లో ఉండలేదు.

న‌లుగురి పేర్ల‌ను ప‌రిశీలించాం..

22ఏ ను సమూలంగా సమీక్షించి, సవరించాలని సీఎం అనుకుంటుండు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కి అభ్యర్థుల వడపోత జరిగింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌కు నాలుగు పేర్లను పరిశీలించాం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్‌కు నలుగురి పేర్లను ప‌రిశీలిస్తున్నం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని దామోదర్ రాజనర్సింహ పర్యవేక్షిస్తున్నారు.

రెండుమూడు రోజుల్లో గ్రాడ్యుయేట్ అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. రెండోసారి ఇష్యూను క్లోజ్ చేసుకోమని కొండా సురేఖకు చెప్పాను. నేను మంత్రి కావాలని కోరుకోలేదు. నన్ను ఇంతవరకు ఎవరూ అడగలేదు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని మా అందరి ఆకాంక్ష అని మ‌హేశ్ కుమార్ వ్యాఖ్య‌నించారు.

Advertisement
Advertisement