Madhusudana Chari | గవర్నర్ ప్రసంగంలో బీజేపీ ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా కాంగ్రెస్ సర్కార్ స్టేట్‌మెంట్లు: మధుసూదనా చారి
Madhusudana Chari | గవర్నర్ల చేత అర్ధ సత్యాలు.. అసత్యాలు చెప్పించడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని మండలిలో విపక్ష నేత మధుసూదనా చారి (Madhusudana Chari) విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా కాంగ్రెస్ సర్కార్ స్టేట్‌మెంట్లు ఉన్నాయని మండిపడ్డారు.
Madhusudana Chari | త్రినేత్ర.న్యూస్: గవర్నర్ల చేత అర్ధ సత్యాలు.. అసత్యాలు చెప్పించడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని మండలిలో విపక్ష నేత మధుసూదనా చారి (Madhusudana Chari) విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా కాంగ్రెస్ సర్కార్ స్టేట్‌మెంట్లు ఉన్నాయని మండిపడ్డారు. తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ఈ సర్కార్‌కు వంతపాడటానికి ఇక్కడ లేమని చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో పాల్గొన్న మధుసూదనా చారి మాట్లాడుతూ.. `ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ప్రసంగాలను గమనిస్తే తెలిసి కావాలని, గవర్నర్ల చేత చేత అర్ధ సత్యాలు, అసత్యాలను చెప్పించడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం గంభీరంగా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల విషయంలో ఏం జరిగింది, ఏం జరగబోతున్నదనే విషయంలో స్పష్టతనివ్వాల్సిన ప్రభుత్వం.. ఎదుటివారిపై దుమ్మెత్తి పోయడానికి, చేసిన పనులను చెప్పుకునేందుకు నైతిక స్థైర్యంలేక ఊహా ప్రపంచంలోకి తీసుకేళ్లే ప్రయత్నం చేయించింది.
బాధ్యతా యుత ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామే తప్ప.. వంతపాడటానికి తాము ఇక్కడ లేము. సంక్షేమ పథకాలు అందేలా సాహసోపేతమైన సంస్కరణలు, రోడ్ మ్యాప్ అంటున్న ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు ఎందుకు చట్టబద్ధత తీసుకురాలేకపోతున్నది?. దానికి ఇప్పటివరకు ఎందుకు రోడ్ మ్యాప్ నిర్ణయించలేకపోతున్నదని ప్రశ్నిస్తున్నాం. ప్రజలను మభ్యపెట్టడానికి, అవసరార్ధపు మాటలు మాట్లాడటం తప్ప ఏ విషయాల ఆధారంగా అధికారంలోకి వచ్చారో, ఏ అంశాలను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారో దాని విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. తడిగుడ్డతో గొంతు కోయడానికి వెనుకాడటం లేదు అనడానికి ఇది నిదర్శనం.
వికసిత్ భారత్ 2047 విజన్‌కు అనుగుణంగా అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్నది. స్థిరమైన వృద్ధితో జాతీయ తలసరి ఆదాయం సాగుతున్నదని అన్నారు. ఈ రెండు అంశాలు బీజేపీ ప్రభుత్వానికి చెందిన విజన్‌కు అనుగుణంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు భిన్నంగా.. ఆ పార్టీ అగ్రనాయకులు మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను మోదీ కుప్పకూల్చారని అంటున్నారు. మరి వీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు?. ఎవరిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు?. అంటే ఢిల్లీ హైకమాండ్ లైనుకు భిన్నంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నది అంటే.. వీరు ఎవరికి వంత పాడుతున్నారో అర్ధమవుతున్నది. ఇది ఒకరకంగా మిలఖత్‌గా కనిపిస్తున్నది` అని మధుసూదనా చారి విమర్శించారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



