Madhusudana Chari | స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా.. ఇండ్లు లేని నిరుపేదలు ఇంకా ఉన్నారంటే కారణమెవరు?: ఎమ్మెల్సీ మధుసూదనా చారి
Madhusudana Chari | దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారంటే దానికి కారణమెవరని మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ నేత మధుసూదనా చారి (Madhusudana Chari) ప్రశ్నించారు. అభయహస్తం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండటం లేదని విమర్శించారు.
Madhusudana Chari | త్రినేత్ర.న్యూస్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారంటే దానికి కారణమెవరని మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ నేత మధుసూదనా చారి (Madhusudana Chari) ప్రశ్నించారు. అభయహస్తం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండటం లేదని విమర్శించారు. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారని, కానీ ఆచరణ మాత్రం ఆవిధంగా లేదని మండిపడ్డారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఇండ్ల నిర్మాణంపై మధుసూదనా చారి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. `ఏడాదికి 4.5 లక్ష ఇండ్లు ఇస్తామన్నరు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లకు పెండింగ్ బిల్లులన్నిటిని రద్దు చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారంటే దానికి కారణమెరో ఆలోచించాలి.
పేద ప్రజలు కేంద్ర బిందువుగా సాగేకార్యక్రమాన్ని స్వాగతిద్దాం. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, ఐదేండ్లలో ప్రతి కుటుంబానికి పక్కా ఇంటిని నిర్మించి ఇస్తామన్నరు. కానీ, ఈ ప్రకటనకు, ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలకు గానీ, మంత్రి చెబుతున్న జవాబుకు మధ్య గ్యాప్ ఉన్నది. ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయి. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత లేదు. అర్హులకు అన్యాయం జరుగుతున్నదని ప్రజలు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అందువల్ల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇండ్లు ఇవ్వాలి` అని కోరారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






