త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Indlu | సర్కార్ శుభవార్త.. జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇండ్ల‌ రెండో దశ పంపిణీ

Indiramma Indlu | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఇండ్లు లేనివారికి ప్ర‌భుత్వం శుభ‌వార్త అందించింది. ఇందిర‌మ్మ ఇండ్ల (Indiramma Indlu) రెండో ద‌శ పంపిణీని (Second Phase) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభించ‌నుంది.

G

Telangana | Published On May 13, 2026, 6.20 am IST

Indiramma Indlu | సర్కార్ శుభవార్త.. జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇండ్ల‌ రెండో దశ పంపిణీ
Advertisement

Indiramma Indlu | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఇండ్లు లేనివారికి ప్ర‌భుత్వం శుభ‌వార్త అందించింది. ఇందిర‌మ్మ ఇండ్ల (Indiramma Indlu) రెండో ద‌శ పంపిణీని (Second Phase) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభించ‌నుంది. ఆదిలాబాద్ (Adilabad) వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. తొలి విడుత‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా 4.50 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కొన్ని ఇండ్ల నిర్మాణాలు పూర్త‌వ‌గా, మ‌రికొన్ని వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి. రెండో దశకు సంబంధించిన విధివిధానాలపై ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించ‌నున్నారు. ఇక హైద‌రాబాద్ ప‌రిధిలో స్థ‌లం ఉంటే ఇందిర‌మ్మ ఇల్లు ఇవ్వ‌నున్నారు.

గత ప్రభుత్వం దూరదృష్టి లేకుండా హైదరాబాద్‌కు 20-30 కిలోమీటర్ల దూరంలో రెండు పడక గదుల ఇండ్ల‌ను నిర్మించి, నగరంలో నివసిస్తున్న వారికి కేటాయించింద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమ‌ర్శించారు. దీంతో వారి జీవనోపాధిపై ప్రభావం పడటంతో ల‌బ్ధిదారులు అక్కడ ఉండేందుకు నిరాకరిస్తున్న‌ట్లు తేలింద‌ని చెప్పారు. మ‌రోసారి అలాంటి తప్పు జ‌రుగ‌కుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5-8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్ల‌ను నిర్మించి ఇస్తామ‌న్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గాన్ని ఒక‌ యూనిట్‌గా తీసుకుంటామ‌ని, ప్రభుత్వ, భూదాన్‌ భూములు, మురికివాడలు, గతంలో వివిధ పథకాల కింద నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరిన ప్రాంతాలను గుర్తించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ల‌బ్దిదారుల ఎంపిక‌కు ప్ర‌త్యేక డ్రైవ్‌

హైదరాబాద్ ప‌రిధిలో ఇండ్ల స్ధ‌లాలు ఉండి అర్హులైన ల‌బ్దిదారుల‌కు ఈనెల చివ‌రిలోగా ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు ప‌త్రాల‌ను అంద‌జేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే పూర్తయిన‌ డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాల‌న్నారు. ఆయా కాలనీలకు 5-8 కి.మీ. దూరంలో ఉన్న వారినే ఎంపిక చేయాలని స్ప‌ష్టం చేశారు. కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించిన తర్వాతే లబ్ధిదారులను గృహ ప్రవేశం చేయించాలన్నారు.

 

Advertisement
Advertisement