త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రేవంత్ లాంటి తెలంగాణ వ్య‌తిరేకులు గ‌ద్దెనెక్కితే.. రాష్ట్రాభివృద్ధిపై ప్రేమ ఎలా ఉంటుంది?: కేటీఆర్‌

KTR | రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ (Telangana) వ్యతిరేకులు గద్దెనెక్కితే రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి ప్రేమ ఉండదనే నిజం ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. జై తెలంగాణ అనని వ్యక్తి నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి (Revanth Reddy) అయ్యారని, అలాంటోడికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా? అని ప్రశ్నించారు.

G

Telangana | Published On Aug 15, 2026, 12.21 pm IST

KTR | రేవంత్ లాంటి తెలంగాణ వ్య‌తిరేకులు గ‌ద్దెనెక్కితే.. రాష్ట్రాభివృద్ధిపై ప్రేమ ఎలా ఉంటుంది?: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ (Telangana) వ్యతిరేకులు గద్దెనెక్కితే రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి ప్రేమ ఉండదనే నిజం ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. జై తెలంగాణ అనని వ్యక్తి నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి (Revanth Reddy) అయ్యారని, అలాంటోడికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా? అని ప్రశ్నించారు. 18 గంటలు పనిచేస్తున్నానని గొప్పలు చెబుతున్నాడని, తమ్ముళ్లకు భూములు ఎలా దోచిపెట్టాలని పనిచేస్తున్నావా అని నిల‌దీశారు. అంబానీ కన్నా గొప్పగా నీకుటుంబాన్ని తయారుచేసుకుంటావా? అని అడిగారు. మోసపోతే గోసపడతారని కేసీఆర్ (KCR) అనాడే చెప్పారని తెలిపారు. హైద‌రాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న కేటీఆర్‌.. జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. అనంత‌రం మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) పాలనతో విసిగిపోయిన జ‌నం ఇప్పుడు కేసీఆర్ పాలన కావాలని తండ్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ఉంటే అన్ని పథకాలు వచ్చేవని అంటున్నార‌ని చెప్పారు. ఓటేసే ముందు ఆలోచించకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయని వెల్ల‌డించారు. మోసపోతే గోసపడతారని కేసీఆర్ అనాడే చెప్పారని గుర్తుచేశారు.

మేనిఫెస్టోలో చెప్పకపోయినా..

ప్ర‌స్తుతం రాష్ట్రంలో రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితి లేదని విమ‌ర్శించారు. యూరియా కావాలంటే మ‌ళ్లీ లైన్ల‌లో నిలబడే పరిస్థితి వ‌చ్చింద‌ని మండిప‌డ్డారు. కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారని, కానీ ఇప్పుడు ఉన్న కల్యాణ లక్ష్మీని కూడా ఊడగొట్టార‌ని మండిపడ్డారు. నాయకుడికి మనసుంటే గొప్ప పథకాలు పుట్టుకొస్తాయన్నారు. బాల్య‌ వివాహాలకు అడ్డుకట్టు వేయడానికి కేసీఆర్ కల్యాణలక్ష్మీ (Kalyana Lakshmi) పథకం తెచ్చార‌ని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా పథకం తీసుకొచ్చార‌ని వెల్ల‌డించారు. తెలంగాణ వచ్చినంక ఆరు నెలలకే 24 గంటల కరెంటు తెచ్చిండు అని తెలిపారు. పదేండ్లలోనే కేసీఆర్ అద్భుతాలు చేసిండు అని పేర్కొన్నారు. దేశాన్ని 60 ఏండ్లు ప‌రిపాలించిన‌వారు ఏం చేశారని ప్రశ్నించారు. దేశం పోవాల్సిన పద్ధతుల్లో ముందుకు పోలేదని చెప్పారు. దేశం కోసం ఆనాడు కేసీఆర్ అడుగు ముందుకేసిండు అని తెలిపారు. నా దేశం ఎలా బాగుపడాలి అన్న సంకల్పంతో పనిచేయాలని సూచించారు.

స‌బ్ కా వికాస్ ఎక్క‌డ‌..

డ‌బుల్ ఇంజిన్ అని కేంద్ర పాలకులు డబ్బా కొడుతున్నారని విమ‌ర్శించిన కేటీఆర్‌.. తెలంగాణలోని సింగిల్ ఇంజిన్ మోత మోగించలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ కన్నా మెరుగ్గా పనిచేసిన డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉందా అని అడిగారు. దేశంలోని 28 ఇంజిన్లు పోటీపడి ఉరికితే బాగుపడలేమా అన్నారు. హైదరాబాద్‌ మెట్రోకు (Hyderabad Metro) కేంద్రం ఎందుకు అనుమ‌తి ఇవ్వదని మండిప‌డ్డారు. ఎలక్షన్లు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం మెట్రోలు ఇస్తున్నారని, సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఎక్కడుందని ధ్వ‌జ‌మెత్తారు. మీతో అంటకాగని రాష్ట్రాలపై కక్షగట్టడమేనా మీ వికాసం అని మండిప‌డ్డారు. మనకన్నా చిన్న దేశాలు ఎక్కడికో దూసుకెళ్లాయని, మనం మాత్రం కులమతాల కొట్లాటల్లోనే ఉన్నామని విమ‌ర్శించారు. ఎన్నికలు రాగానే దేవుళ్ల పేర్లు చెప్పడం, అక్షింతలు పంచడం చేస్తున్నారని విమర్శించారు.

అవ‌మానిస్తున్నారు..

పాకిస్థాన్ కంటే గొప్పగా ఉన్నామని మనల్ని మత్తులో పెడుతున్నారని చెప్పారు. నిజానికి మనం ఎవరితో పోల్చుకోవాలని ప్రశ్నించారు. మతం మత్తులో పడి మనం ఎక్కడికో కొట్టుకుపోతున్నామని చెప్పారు. 80 ఏండ్ల‌ కాలాన్ని చూసుకుంటే కొంత సంతోషం, కొంత బాధ కలుగుతుందని అన్నారు. ఇన్ని వైరుధ్యాల నడుమ కలిసి మెలసి ఉండటం మన గొప్పతనం అని తెలిపారు. స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. అలాంటివారిని పాలకులు అవమానిస్తున్నారని చెప్పారు. గాంధీజీని (Mahatma Gandhi) అవమానించాలని చూస్తున్నారని, మ‌హాత్ముడిని చంపిన వారిని నెత్తిన పెట్టుకుంటున్నారని విమ‌ర్శించారు. నెహ్రూను ఈ రోజుకీ అవమానిస్తూనే ఉన్నారని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement