త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Liquor Shops | మందుబాబులకు షాకింగ్‌ న్యూస్‌.. ఈ మూడురోజులు వైన్స్‌లు బంద్‌..!

Liquor Shops | మందుబాబులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. రెండు రోజుల పాటు వైన్స్‌లు, బార్లు మూతపడనున్నాయి. తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 11న జరుగనున్న విషయం తెలిసిందే.

P

Telangana | Published On Feb 9, 2026, 10.14 pm IST

Liquor Shops | మందుబాబులకు షాకింగ్‌ న్యూస్‌.. ఈ మూడురోజులు వైన్స్‌లు బంద్‌..!
Advertisement

Liquor Shops | మందుబాబులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. రెండు రోజుల పాటు వైన్స్‌లు, బార్లు మూతపడనున్నాయి. తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 11న జరుగనున్న విషయం తెలిసిందే. క్రమంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఓటింగ్‌ జరిగే ఏడు కార్పొరేషన్లతో పాటు 117 మున్సిపాలిటీల పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు రెండు రోజుల పాటు మూసి ఉండనున్నాయి. ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగియడంతో సాయంత్రం 5 గంటలకు ఎక్సైజ్‌ అధికారులు వైన్స్‌లను క్లోజ్‌ చేశారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల వరకు ఆయా పట్టణాల్లో లిక్కర్‌ దుకాణాలు మూతపడుతాయి. అలాగే, ఈ నెల 13న ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించింది. ఈ రోజు సైతం వైన్స్‌లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా లిక్కర్‌ అమ్మితే చట్టరీత్యా చర్యలుంటాయని, లైసెన్స్‌లు సైతం రద్దవుతాయని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలతో పాటు మహబూబ్‌నగర్‌, కొత్తగూడెం, మంచిర్యాల, కరీంనగర్‌, నల్గొండ, రామగుండం, నిజామాబాద్‌ కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరుగనున్నాయి. 2,996 వార్డులకు పెద్ద ఎత్తున అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 11న ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. దాదాపు 52.43లక్షల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 13న ఓట్ల లెక్కింపు నిర్వహించి.. విజేతలను ప్రకటించనున్నారు.

Advertisement
Advertisement