Liquor Sales In Telangana | తెలంగాణ ఎక్సైజ్ శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం.. భారీగా పెరిగిన మద్యం విక్రయాలు..
Liquor Sales In Telangana | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీ ఎత్తున ఆదాయం లభిస్తోంది.
Liquor Sales In Telangana | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీ ఎత్తున ఆదాయం లభిస్తోంది. మద్యం విక్రయాలతోపాటు వైన్స్, బార్ లైసెన్స్ ఫీజులు, దరఖాస్తు రుసుము ద్వారా పెద్ద మొత్తం సమకూరుతోంది. ప్రతి ఏడాది గణనీయమైన వృద్ధిని సాధిస్తున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సుమారు 7 శాతం వృద్ధిని నమోదు చేసి రికార్డు స్థాయిలో ఆదాయం రాబట్టింది. భారీ ఎత్తున మద్యం విక్రయాలు చోటు చేసుకోవడంతో ఈ ఆదాయం మరింతగా పెరిగింది.
రూ.44,557 కోట్ల ఆదాయంతో రికార్డు..
తెలంగాణ ఎక్సైజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో మొత్తం రూ. 44,557 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో మద్యం అమ్మకాల ద్వారా రూ. 40,209 కోట్లు, లైసెన్స్ ఫీజులు, బార్ల ద్వారా మిగిలిన ఆదాయం సమకూరింది. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయి ఆదాయం రావడం ఇదే మొదటిసారి కాగా గతేడాదితో పోలిస్తే సుమారు 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మద్యం అమ్మకాల ద్వారా మొత్తం రూ.40,209 కోట్ల ఆదాయం రాగా, వైన్స్, బార్ల లైసెన్స్ ఫీజుల ద్వారా సుమారు రూ.5,189 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు 95,628 దరఖాస్తుల ద్వారా రూ. 2,869 కోట్ల ఆదాయం అదనంగా వచ్చింది.
రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి రూ.40వేల కోట్ల మార్కుకు..
2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 382.91 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరగ్గా, 387.34 లక్షల కేసుల బీరు అమ్మకాలు కొనసాగాయి. ఇక 2024-25లో రూ.37,487 కోట్లుగా ఉన్న ఆదాయం, 2025-26లో 7 శాతం పెరిగింది. డిసెంబర్ నెలలోనే రికార్డు స్థాయిలో రూ.5,051 కోట్ల మద్యం విక్రయాలు చోటు చేసుకున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.20,859 కోట్లుగా ఉన్న ఎక్సైజ్ ఆదాయం, కేవలం ఏడు సంవత్సరాల్లోనే రెట్టింపునకు పైగా పెరిగి రూ. 40 వేల కోట్ల మార్కును దాటడం విశేషం. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం రికార్డుగా చెప్పవచ్చు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌శాఖకు రూ.20,859 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం ఏడు సంవత్సరాల్లో 2025-26 నాటికి రూ.40,209 కోట్లకు చేరుకుంది. 2024-25 తో పోలిస్తే 2025-26 లో రూ.2722 కోట్ల మద్యం అమ్మకాలు అదనంగా పెరిగాయి.

పెరిగిన లిక్కర్ సేల్స్, తగ్గిన బీర్ల అమ్మకాలు..
2025-26 ఆర్థిక సంవత్సరంలో 2 శాతం లిక్కర్ సేల్స్ పెరగగా, బీర్ల అమ్మకాలు 9 శాతం మేర తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 372.25 లక్షల కేసుల లిక్కర్, 536.13 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. 2024-25 తో పోలిస్తే 2025-26లో బీర్ల అమ్మకాలు తగ్గాయి, లిక్కర్ అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. కాగా ఎక్సైజ్‌శాఖకు 2,620 ఎ-4 మద్యం షాపుల ద్వారా సంవత్సరానికి రెంటల్ ఫీజ్ రూపంలో మొత్తం రూ. 1771 కోట్ల ఆదాయం సమకూరింది. 1214 బార్ల ద్వారా రూ.549 కోట్ల ఆదాయం వస్తోంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో నెలవారీగా మద్యం అమ్మకాలు ఇలా ఉన్నాయి.
- 2025 ఏప్రిల్ - రూ. 3,272 కోట్లు
- 2025 మే - రూ. 3,561 కోట్లు
- 2025 జూన్ - రూ. 3,273 కోట్లు
- 2025 జూలై - రూ. 3,320 కోట్లు
- 2025 ఆగస్టు - రూ. 3,082 కోట్లు
- 2025 సెప్టెంబర్ - రూ. 3,048 కోట్లు
- 2025 అక్టోబర్ - రూ. 2,709 కోట్లు
- 2025 నవంబర్ - రూ. 2,868 కోట్లు
- 2025 డిసెంబర్ - రూ. 5,051 కోట్లు
- 2026 జనవరి - రూ. 3,325 కోట్లు
- 2026 ఫిబ్రవరి - రూ. 3,208 కోట్లు
- 2026 మార్చి - రూ. 3,486 కోట్లు
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఎక్సైజ్ శాఖ ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి.
- 2015-16లో రూ. 12,706 కోట్లు
- 2016-17లో రూ. 14,184 కోట్లు
- 2017-18లో రూ.17,597 కోట్లు
- 2018-19లో రూ.20,859 కోట్లు
- 2019-20లో రూ.22,605 కోట్లు
- 2020-21లో రూ.27,286 కోట్లు
- 2021-22లో రూ.30,783 కోట్లు
- 2022-23లో రూ. 35,145 కోట్లు
- 2023-24లో రూ.37,675 కోట్లు
- 2024-25లో రూ.37,488 కోట్లు
- 2025-26లో రూ. 40,209 కోట్లు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



