త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Update | నేడు ఈ జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్తారు వాన‌లు..

Rain Update | సోమ‌వారం సాయంత్రం రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వాన‌లు కురిశాయి. మంగ‌ళ‌వారం కూడా ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన తేలిక‌పాటి నుంచి మోస్తారు వ‌ర్షాలు (Rain Update) కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

G

Telangana | Published On Mar 17, 2026, 9.09 am IST

Rain Update | నేడు ఈ జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్తారు వాన‌లు..
Advertisement

Rain Update | త్రినేత్ర‌.న్యూస్: ఒక్క‌సారిగా పెరిగిన ఉష్ణోగ్ర‌త‌లో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు వ‌ర‌ణుడు కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించాడు. సోమ‌వారం సాయంత్రం రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వాన‌లు కురిశాయి. మంగ‌ళ‌వారం కూడా ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన తేలిక‌పాటి నుంచి మోస్తారు వ‌ర్షాలు (Rain Update) కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వార్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. దీంతోపాటు గంట‌కు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని చెప్పింది.

కాగా, సోమ‌వారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా మన్నూర్‌లో అత్యధికంగా 2.4, మెదక్‌ జిల్లా రేగోడ్‌లో 1.8, సంగారెడ్డి జిల్లా రాయికొడ్‌లో 1 సెంటీమీటర్‌ వర్షపాతం నమోద‌యింది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌, శివ్వంపేటలో 30 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో ప‌లుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌, మోతీన‌గ‌ర్‌, బాలానగర్‌, అల్వాల్‌, అసిఫ్‌నగర్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మేడ్చల్‌ పట్టణం, ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పరిధిలో వడగండ్ల వాన కురిసింది.

బాలాన‌గ‌ర్‌లో అత్య‌ధికంగా 3.3 మిల్లీమీట‌ర్ల వ‌ర్షం ప‌డ‌గా, ముషీరాబాద్‌లో అత్య‌ల్పంగా 0.5 మిల్లీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది. అల్వాల్‌లో 2.5, మూసాపేట‌, తిరుమ‌ల‌గిరి 2, ఖైర‌తాబాద్ 1.8, హిమాయ‌త్‌న‌గ‌ర్ 1.3, కుత్బుల్లాపూర్‌, మ‌ల్కాజిగిరిలో 1 మిల్లీమీట‌ర్ల చొప్పున వ‌ర్ష‌పాతం న‌మోద‌యింది. కాగా, రానున్న ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

https://x.com/balaji25_t/status/2033733990377787446

 

Advertisement
Advertisement