Vaddiraju Ravichandra | బొగ్గు స్కాంపై పార్లమెంట్‌లో నిలదీస్తా: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Vaddiraju Ravichandra | సింగరేణి (Singareni) బొగ్గు స్కాంను బహిర్గతం చేసినందుకు హరీశ్‌రావు (Harish Rao) కు నోటీసులు ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) ఆరోపించారు. బొగ్గు స్కాంపై పార్లమెంట్‌లో ప్రస్తావించి, విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తానని చెప్పారు.
Vaddiraju Ravichandra | త్రినేత్ర.న్యూస్ : సింగరేణి (Singareni) బొగ్గు స్కాంను బహిర్గతం చేసినందుకు హరీశ్‌రావు (Harish Rao) కు నోటీసులు ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) ఆరోపించారు. బొగ్గు స్కాంపై పార్లమెంట్‌లో ప్రస్తావించి, విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తానని చెప్పారు. తెలంగాణ భవన్‌లో వద్దిరాజు విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్లగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు చూస్తున్నారని, సీరియల్ మాదిరిగా రోజుకో కేసు పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని, కేటీఆర్, హరీశ్‌రావులు అనేక సార్లు అక్రమ కేసుల కారణంగా జైలుకు పోయారని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టలేరని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను ఎంత వేధించినా తెలంగాణ సమాజం అంత ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించామన్న ఆయన.. మున్సిపల్ ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే కేసుల పేరుతో కాంగ్రెస్ సర్కార్ డ్రామాకు తెరతీసిందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలపై ముందుగా విచారణ జరపాలి: దూదిమెట్ల బాలరాజుయాదవ్
రాష్ట్రప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడుతోందని, ముందుగా వాటిపై విచారణ జరిపించాలని మాజీ కార్పొరేషన్ ఛైర్మెన్ బాలరాజు యాదవ్ డిమాండ్ చేశారు. హరీష్ రావు పైన రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను మాజీ కార్పొరేషన్ చైర్మెన్‌లుగా ఖండిస్తున్నామన్నారు. బొగ్గు టెండర్ల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు కొట్లాడుతున్నారని ఆరోపించారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని వార్తలు వస్తున్నాయని, దోచుకుంటున్న వాటాల పంచాయతీనే మంత్రుల మధ్య గొడవలకు కారణమని అన్నారు. సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాల్సి వస్తే రేవంత్‌రెడ్డి అల్లుడిపై సిట్ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రుల మధ్య గొడవ ఉందని రేవంత్ రెడ్డి దావోస్ పారిపోయాడని ఆరోపించారు. నిప్పులాంటి నాయకుడు హరీశ్‌రావు అని అన్నారు. ఆయన నీతి నిజాయితీ కలిగినవాడని చెప్పారు. హామీలపై ప్రశ్నిస్తుంటే ఆయనపై రాళ్ల దాడి చేస్తున్నారని విమర్శించారు. రోజుకో కేసు పేరుతో బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం, ధరణి, కుంభకోణం అన్నారు ఏమైందో అందరికీ తెలుసని అన్నారు. సూర్యుడు మీద ఉమ్మి వేస్తే వారి మీదనే పడుతుందని ఎద్దేవా చేశారు.
కేసులకు భయపడితే బీఆర్ఎస్ ఉండేదే కాదు: టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తెలంగాణ రాష్ట్రమంత చూస్తుందని, కేసులు తమకు కొత్త కాదని, కేసులకే భయపడితే బీఆర్ఎస్ పార్టీనే ఉండేది కాదని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులను కేసుల పేరుతో విచారణకు పిలవడమే సరిపోయిందని విమర్శించారు. విచారణల పేరుతో కొండను తవ్వి ఎలుకను కూడ పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చెయ్యలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీసిందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెట్టినందుకే కుట్ర పూరితంగా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



