Pavithra Gowda | దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు హైకోర్టులో ఎదురుదెబ్బ..!
Pavithra Gowda | కన్నడ సూపర్ స్టార్ దర్శన్ ప్రియురాలు, నటి పవిత్రగౌడకు కర్నాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పవిత్రగౌడతో పాటు మరో నిద్దరు నిందితులు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు దిగువ కోర్టు ఇచ్చిన ఫెసిలిటీని రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Entertainment | Published On Jan 20, 2026, 9.02 pm IST
Pavithra Gowda | కన్నడ సూపర్ స్టార్ దర్శన్ ప్రియురాలు, నటి పవిత్రగౌడకు కర్నాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పవిత్రగౌడతో పాటు మరో నిద్దరు నిందితులు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు దిగువ కోర్టు ఇచ్చిన ఫెసిలిటీని రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రేణుకా స్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ప్రస్తుతం బెంగళూరులోని సెంట్రల్ జైలులో ఉన్నారు. గతంలో దిగువ కోర్టు పవిత్ర గౌడతో పాటు ఇతర నిందితులు వారానికోసారి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలైంది. రిట్‌ను విచారించిన కోర్టు ఈ సందర్భంగా సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించింది. జైలులో ఉన్న నిందితులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంపై కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొంటూ.. ఓ వ్యక్తి ఏ హోదాలో ఉన్నా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని 2024 జూన్ 11న హత్య కిడ్నాప్ చేసిన హత్య చేసిన కేసులో కన్నడ సూపర్ స్టార్ దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు 15 మంది అరెస్టయ్యారు. ఈ కేసులో సెప్టెంబర్ 4న పోలీసులు 3,991 పేజీల చార్జిషీట్‌తో పాటు అదనపు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. 131 రోజులు కస్టడీలో గడిపిన తర్వాత, దర్శన్ అక్టోబర్ 30, 2024న బెయిల్‌పై విడుదలయ్యారు. కర్నాటక పోలీసులు చేసిన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు పవిత్రగౌడ, దర్శన్, ఇతర నిందితులకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. సంచలనంగా నిలిచిన ఈ కేసులో కోర్టు దర్శన్, పవిత్ర గౌడ, 15 మంది సహ నిందితులపై అభియోగాలు మోపింది. నిందితులు వాటిని ఖండించారు. దర్శన్‌పై ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య, సెక్షన్ 355 కింద తీవ్ర గాయాలు కలిగించడం, సెక్షన్ 120బీ కింద నేరపూరిత కుట్ర, సెక్షన్ 204 కింద సాక్ష్యాలను ధ్వంసం చేయడం, సెక్షన్ 359 కింద కిడ్నాప్ ఆరోపణలు మోపారు. దాంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద అభియోగాలను మోపారు. ఈ కేసులో దర్శన్ బళ్లారి జైలో ఉన్నాడు. బెంగళూరు సెంట్రల్ జైలులో రాచ మర్యాదలు అందుతున్నట్లుగా ఫొటోలు వెలుగులోకి రావడంతో అక్కడికి తరలించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






