త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srisailam | శ్రీశైలంలో చిరుత పులుల క‌ల‌క‌లం.. ఆందోళ‌న‌లో విద్యార్థులు

Srisailam | శ్రీశైలంలో చిరుత పులుల సంచారం కల‌క‌లం సృష్టిస్తోంది. స్థానికంగా ఉన్న ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోకి చిరుత‌లు ప్ర‌వేశించాయి. రాత్రంతా కాలేజీ ఆవ‌ర‌ణ‌లో సంచారం చేశాయి.

S

Telangana | Published On Apr 28, 2026, 9.20 am IST

Srisailam | శ్రీశైలంలో చిరుత పులుల క‌ల‌క‌లం.. ఆందోళ‌న‌లో విద్యార్థులు
Advertisement

Srisailam | త్రినేత్ర‌.న్యూస్ : శ్రీశైలంలో చిరుత పులుల సంచారం కల‌క‌లం సృష్టిస్తోంది. స్థానికంగా ఉన్న ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోకి చిరుత‌లు ప్ర‌వేశించాయి. రాత్రంతా కాలేజీ ఆవ‌ర‌ణ‌లో సంచారం చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

రాత్రి స‌మ‌యం కావ‌డంతో.. ఆ స‌మ‌యంలో విద్యార్థులెవ‌రూ లేక‌పోవ‌డంతో కాలేజీ సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వాచ్‌మెన్‌ను గ‌మ‌నించిన చిరుత‌లు.. త‌ర‌గ‌తి గ‌దుల వైపు రాకుండా బ‌య‌ట‌కు ప‌రుగెత్తాయి.

చిరుత‌ల సంచారంతో వాచ్‌మెన్ కూడా ఉలిక్కిప‌డ్డాడు. ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గ‌డిపాడు. స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. చిరుత‌ల‌ను బంధించాల‌ని స్థానికులు అట‌వీ శాఖ అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement